Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియాలో ఇలా ఎక్కడైన సరే ఈ అమ్మడి రచ్చ మాములుగా ఉండదు. సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇటీవల ఆమె నటించిన దర్జా చిత్రం. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్ చిత్రంగా దర్జా తెరకెక్కింది.
శివశంకర్ పైడిపాటి నిర్మించిన ఈ మూవీకి కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరించారు. జులై 22న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. అభిమానులు ఎంతగానో దర్జా సినిమా కోసం ఎదురు చూడడం, ఆ సినిమా విడుదలై నిరాశపరచడం జరిగింది. ఈ మూవీని ఓటీటీ ఆడియెన్స్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మూవీ ఓటీటీ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసింది. స్పెషల్ ప్రీమియర్ గా దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 5 నుంచి ప్రసారం చేయనున్నారు. మూవీలో అనసూయ, సునీల్ తోపాటు డ్యాన్సర్ అక్సా ఖాన్, జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ లు కూడా మరో పాత్రల్లో నటించారు.

ఈ అమ్మడు రీసెంట్డగా వాంటెడ్పండుగాడ్మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్బిజీగా ఉంది. అటు బుల్లితెరతో పాటు..ఇటు వెండితెరపై కూడా అనసూయ తన సత్తా చాటుతోంది. పుష్ప, రంగస్థలం వంటి హిట్ సినిమాల్లో అనసూయ నటంచిన విషయం తెలిసిందే. రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పుష్ప ది రైజ్ చిత్రంలో దాక్షాయణిగా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్ లో నటించి ఆకట్టుకుంది. అనసూయ సినిమా ఆఫర్స్ దక్కించుకున్నప్పటికీ అ అమ్మడు ఎందుకో పెద్దగా పేరు ప్రఖ్యాతలు మాత్రం పొందడం లేదు.