Anasuya : యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ కూడా ఉండాలి. అలా అందం, అభినయంతో అలరించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు అనసూయ. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటోంది ఈ బ్యూటీఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్. సోగ్గాడే చిన్ని నాయన’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత వరుసగా ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో సినిమాలతోపాటు స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది.
జబర్ధస్త్‌తోనే అనసూయ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. చాలా ఏళ్లు జబర్ధస్త్‌లో ఉంటూ పలు షోస్, సినిమాలు చేసింది. ఏమైందో ఏమో ఇటీవల జబర్ధస్త్‌కి గుడ్ బై చెప్పింది. ఇప్పుడు ఆమె స్థానంలో రష్మీ యాంకరింగ్ చేస్తుంది. అయితే అనసూయ తన చెల్లెలు వైష్ణవిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. తన చెల్లెలికి ఇప్పుడు అనసూయ అనే బడా బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఆమె ఈ ఫీల్డ్‌లోకి రావడం పెద్ద సమస్య ఏమి కాదు.జబర్ధస్త్ షోలోకి మెల్లగా వైష్ణవిని పంపే ప్రయత్నాలలో అనసూయ ఉందని ప్రచారం జరుగుతుంది. అనసూయకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు.

Anasuya : చెల్లెలని తీసుకొస్తుందా…
వీరిలో వైష్ణవి ఒకరు. అందంలోనూ, చలాకీతనంలోనూ అనసూయని పోలి ఉండే వైష్ణవి కెరీర్ బాధ్యతలు అనసూయ తీసుకున్నారట. ఆ మధ్య అక్క అనసూయతో పాటు బుల్లితెరపై కనిపించిన వైష్ణవి.. యాంకర్ గా కెరీర్ మొదలుపెడితే తిరుగుండదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైష్ణవికి కూడా వ్యాపార రంగంలో అనుభవం ఉంది. మీడియా, ప్రొడక్షన్ తదితర విభాగాల్లో పని చేశారు. అనసూయ మొదట హెచ్ఆర్ గా చేసి.. ఆ తర్వాత మీడియాలో న్యూస్ రీడర్ గా పని చేశారు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో యాంకర్ గా సూపర్ సక్సెస్ అయ్యారు