Anchor Rashmi : ప్రస్తుతం అన్ని విషయాలను తమ అభిమానులతో పంచుకునే నటీ నటులు కొన్ని విషయాలను ఎవరికి తెలియకుండా దాచేస్తున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి విషయాలు. ఇక ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార , విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 9న వీరిద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ లోని అవకతవకల వలన మాకు 2016 మే లోనే పెళ్లయిపోయిందని నయనతార విగ్నేష్ ఇండస్ట్రీలో పెద్ద బాంబు పేల్చారు. అయితే 2016లో వీళ్ళిద్దరికీ పెళ్లి అయితే ఇప్పటివరకు ఎందుకు కలవలేదు..
ఈ విషయాన్ని అభిమానులతో ఎందుకు పంచుకోలేదు అంటూ…జనాలు కామెంట్ చేసిన నయంతార విగ్నేష్ దానికి స్పందించలేదు. ఇక లీగల్ డాక్యుమెంట్ ద్వారా చూసుకుంటే వీరికి జూన్ 9న పెళ్లయింది. ఈ జంట ఇప్పుడు హనీమూన్ ట్రిప్ లను ఎంజాయ్ చేస్తుంది.అయితే ఇలాంటి న్యూస్ మరొకటి వెలుగులోకి వచ్చింది. బుల్లితెర పాపులర్ యాంకర్స్ లో రష్మి గౌతమ్ కూడా ఒకరు. ఇక ఈమె చాలా కష్టపడి పైకి వచ్చింది. ఇక రష్మీ గౌతమ్ మరియు సుడిగాలి సుదీర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంటకు అభిమానులు కూడా ఎక్కువే. ఈ జంటతో ఈటీవీ ఎన్నో ప్రోగ్రామ్స్ ని కూడా నిర్వహించింది. అలాగే వీరిద్దరికీ పెళ్లి అయితే బాగుంటది అని కూడా చాలామంది కోరుకుంటున్నారు కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

రష్మి గౌతమ్ కు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందట. తన భర్తతో తను చాలా హ్యాపీగా ఉంటుందట. అయితే నయనతార లాగానే రష్మీ కూడా తన పెళ్లి విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. రష్మీ పెళ్లి విషయం బయటకు వస్తే తనకు అవకాశాలు తగ్గుతాయని అలాగే సుధీర్ తో ఉన్న ఇమేజ్ పోతుందని ఈ విషయాన్ని దాస్తున్నట్లుగా పలువురు చెబుతున్నారు. ఈ విషయంపై రష్మీ మాట్లాడితే కానీ మనకు క్లారిటీ రాదు. కాని ఇలా సినీ అవకాశాల కోసం పవిత్రమైన పెళ్లి బంధాన్ని దాయడం మంచిది కాదు అని పలువురు అంటున్నారు.