Anchor Rashmi : యాంకర్ రష్మీ తెలుసు కదా. ఒకప్పుడు హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మీ.. ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెరపై స్థిరపడిపోయింది. కేవలం జబర్దస్త్ వల్ల తనకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ ఎంట్రీ, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ గా వర్కవుట్ కావడంతో ఈ జంటకి ఆన్ స్క్రీన్ మీద విపరీతంగా పాపులారిటీ వచ్చేసింది. చాలా ఏళ్ల పాటు తెలుగు బుల్లితెరను ఈ జంట ఏలింది. అందుకే.. సుడిగాలి సుధీర్ కు ఎంత ఫేమ్ వచ్చిందో.. రష్మీకి కూడా అంతే ఫేమ్ వచ్చింది. యాంకర్ అనసూయ తర్వాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ గా రష్మీ రికార్డ్ క్రియేట్ చేసింది.
చివరకు అనసూయ జబర్దస్త్ ను వదిలేసినా రష్మీ మాత్రం జబర్దస్త్ ను అస్సలు వదిలేయలేదు. దాదాపు 10 ఏళ్ల నుంచి జబర్దస్త్ ను అలాగే అట్టిపెట్టుకొని ఉంది. జబర్దస్త్ తో పాటు తనకు శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు ఇతర షోలలోనూ ఆఫర్లు వస్తున్నాయి. అందుకే తన పేరు తెలుగు బుల్లితెర మీద మారుమోగిపోతోంది.
Anchor Rashmi : రష్మీ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్
సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. తన లేటెస్ట్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో, గ్లామర్ షోతో రచ్చ రచ్చ చేసే రష్మీ తాజాగా ఓ షో స్టేజీ మీద వేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. దానికి కారణం.. ఆ షోలో తన అందాలను చూపించడం. ఎద అందాలు కనిపిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా.. నడుము చూపిస్తూ.. పై అందాలు చూసి స్టెప్పులేసి రచ్చ రచ్చ చేసింది రష్మీ. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.