Anchor Varshini : మోడలింగ్ ద్వారా టీవీలోకిి వచ్చి, బుల్లితెర పై యాంకర్ గా తన దైనా శైలిలో యాంకరింగ్ చేసి పేరు తెచ్చుకుంది వర్షిణి .తన ముద్దు ముద్దు మాటలతో, తన అందాలతో కుర్రకారుల మనసును దోచుకుంది.అలాగే సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ తన అందాలతో యువతకు హీట్ పెంచుతుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అటు టీవీ షో లలో మరియు వెబ్ సిరీస్ లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
ఇది ఇలా ఉండగా ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అన్న వార్త సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుందట. అయితే పెళ్ళికొడుకు మరెవరో కాదు తన సొంత బావ అని సమాచారం.వర్షిణి కి తన బావ అంటే చిన్నప్పటి నుండే చాలా ఇష్టం అంట.బావకి కూడా వర్షిణి అంటే అంతే ఇష్టం.ఈ మేరకు ఇరు కుటుంబ సభ్యులు వారి పెళ్లిని నిశ్చయించారంట. వర్షిణి సినిమాలలో మరియు బుల్లితెరలో కొంచెం బిజీగా ఉండటం వలన ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చిందంట.

ఇంకా పెళ్ళికొడుకు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ , ఒకే ఒక్క కొడుకు మరియు కోటీశ్వరుడని సమాచారం.
ఇక త్వరలోనే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతుందని సమాచారం.అలాగే వచ్చే ఏడాది లో వీరిద్దరికీ మ్యారేజ్ కానున్నది అని సమాచారం. కాగా అప్పట్లో వర్షిణికి హైపర్ ఆదికి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వారిద్దరికీ బ్రేకప్ అయిందని కొందరు , వారిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారని ,అంతేకాని వారి మధ్య ప్రేమ లాంటిది ఏం లేదని కొందరు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇప్పుడు వర్షిణి పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .