Adipurush Movie : అక్టోబర్ 2 గాంధీ జయంతి సందడి ఒకవైపు ఆదిపురుష్ టీజర్ హడావిడి మరోవైపు నడుస్తుంది. ప్రభాస్ తొలిసారి రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ నేడు టీజర్ విడుదల చేయబోతున్నారు. సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ ఎలా చేస్తారో.. అంత భారీ స్థాయిలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్ సభ్యులు.. అయోధ్యకు చేరుకున్నారు. వారి వీడియోలు, అయోధ్యలో ఏర్పాట్ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఆదిపురుష్ టీజర్ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చే అతిథులకు అదిరిపోయే ఇన్విటేషన్ కార్డును దర్శక నిర్మాతలు పంపించారు. అది ఎంతో ఆకర్షణీయంగా..అద్భుతంగా ఉంది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటిస్తున్నారు. కృతి సనన్ జానకీ దేవిగా కనిపించనుంది. ఈ చిత్రం టీజర్ విడుదలైతే కాని ఈ సినిమా ఏంటన్నది ఒక అంచనాకి రాలేం. ఫస్ట్ లుక్ పై ఇప్పటికే పాజిటివ్ నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. మరి టీజర్ ఎలాంటి అటెన్షన్ క్రియేట్ చేస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం హిందూ శక్తులు పని చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందుత్వాన్ని చాటిచెప్పే సినిమా కావడంతో ఈ సినిమా టీజర్ అయోధ్యలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Adipurush Movie : హిట్ గ్యారెంటీ..
హిందుత్వాన్ని ప్రభలించే సినిమా గా ఇది తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.గతంలో కూడా ఇలాంటి చిత్రాలు మంచి హిట్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ను బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరెకెక్కించగా, ఈ సినిమాతో తెలుగుతో పాటు పలు భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో .. వాల్డ్ వైడ్‌గా 20,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్టు వార్తల వస్తున్నాయి. ఈ రకంగా ‘ఆదిపురుష్’ సినిమా పాన్ ఇండియా లెవల్ దాటిపోయి.. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కాబోతుంది.