Anushka Shetty : అనుష్క శెట్టి… తెలుగు సినీ పరిశ్రమకు తను ఒక లేడీ బాహుబలి.టాలీవుడ్ లో తనని అందరు స్వీటీ అని పిలుస్తారు. సూపర్ అనే సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలో టాప్ హీరోహిన్ గా మారింది. వరుసగా అగ్రహీరో ల సరసన నటించింది .తన నటనతో తన అందాలతో కుర్రకారులను తనవైపు తిప్పుకుంది. ఒకవైఫ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి తన స్థాయిని పెంచుకుంది.
అరుంధతి మూవీ తో ఎనలేని కీర్తిని సంపాదించుకుంది.ఆ పై వచ్చిన బాహుబలి ,భాగమతి సినిమాలు తనకి ఎంతో పేరును తెచ్చి పెట్టాయి. అయితే ఇటీవల సినిమాలకి పూర్తిగా బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు చివరగా నిశ్శబ్దం సినిమాలో నటించింది. దాని తరువాత నవీన్ పోలిశెట్టి తో ఒక సినిమాను ఓకే చేసి అభిమానులకి గుడ్ న్యూస్ చేపింది. తన రీఎంట్రీ అభిమానులకు ఒక పండగ అనే చెప్పాలి. ఇది ఇలా ఉండగా స్వీటీ త్వరలోనే అభిమనులకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది అనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

అనుష్క శెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు టాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి తెలంగాణలో ఒక బడా వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్దమైంది అని సమాచారం .అయితే వీరికి త్వరలోనే ఎంగేజ్మెంట్ చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయట. వచ్చే ఏడాది లోపు అనుష్క శెట్టి పెళ్లి జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి .ఇప్పుడు ఈ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయం పై మన స్వీటీ ఆలోచన ఏంటో తెలియాల్సి ఉంది .