Akkineni Nagarjuna : ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ అయింది గిరిజా షెట్టర్. 1989లో విడుదలైన గీతాంజలి సినిమాలో నటించింది గిరిజ షెట్టర్. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాగార్జునకు మంచి ఇమేజ్ ను తెచ్చింది. ఇక ఈ సినిమాలో గిరిజ షెట్టర్ చనిపోతాను అని తెలిసి కూడా లైఫ్ ను ఎంజాయ్ చేసే ఓ చంటి పిల్ల క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాలోని తన నటనకు తన ఎక్సప్రెషన్స్ కు మంచి ఇమేజ్ వచ్చింది. గీతాంజలి విజయం తరువాత గిరిజ స్టార్ గా ఇండస్ట్రీని ఏలుతుంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత నాలుగైదు సినిమాలకి తన జర్నీ ముగిసిపోయింది. గీతాంజలి తర్వాత మలయాళంలో వందనం అనే మూవీ చేసి సక్సెస్ అందుకుంది . తర్వాత మరో చిత్రం ప్రారంభమై అనుకోని కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది.
అయితే గిరిజ ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి అమీర్ ఖాన్ సినిమా కారణమని తెలుస్తుంది. అయితే అప్పుడు ఫామ్ లో ఉన్న గిరిజకు బాలీవుడ్ ఆఫర్ వచ్చిందట.ఆ సినిమా లో హీరో అమీర్ ఖాన్. అయితే సినిమా ఒప్పందం అప్పుడు ,తనకు బాడీ ఎక్స్ పోజ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే అసభ్యకర సన్నివేశాలు ఉండవని చెప్పారట. కాని షూటింగ్ టైంలో ఇవి చేయాలంటూ ఇబ్బంది పెట్టారట. దీంతో ఆమె ఒప్పుకోకపోగా ఆ సినీ బృందం పై న్యాయపోరాటం చేసిందట. దీంతో ఆ సినిమా నుండి ఆమెను తొలగించారు. అలాగే తను చేసిన ఒక సాంగ్ ను ఐటెం నెంబర్ గా మార్చేశారు. దాంతో ఆమె సినిమాలకు దూరమైంది.

అసలు గిరిజ నటి కావాలని అనుకోలేదట ఓ ఫంక్షన్ లో మణిరత్నం చూసి సబ్జెక్టు చెప్పి ఆ
ఫర్ ఇచ్చాడు. అలా ఆమె నటి అయింది. గిరిజ చివరగా తుజే మేరీ కసమ్, జెనీలియా మరియు , రితేష్ దేశ్ ముఖ్ నటించిన మూవీలో గెస్ట్ రోల్ ను చేసింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. సినిమాలకు దూరమయ్యాక గిరిజ జర్నలిస్టుగా పనిచేసింది. అలాగే ఫిలాసఫీ మీద ఆర్టికల్స్ ను ప్రచురించింది. అయితే ఆమెకు పెళ్లి మీద అసలు ఆసక్తి లేదట.. జీవితంలో అసలు పెళ్లి చేసుకోనని ,ఖరాఖండీ గా చెప్పేసింది గిరిజ. సినిమాలను మానేశాక తిరిగి లండన్ వెళ్ళిపోయింది గిరిజ.