Bigg Boss 6 Telugu : బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత శ్రీసత్య గురించి ఆ విష‌యం చెప్పిన అవాక్క‌య్యేలా చేసిన అర్జున్ క‌ళ్యాణ్‌

Advertisement

Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న షో బిగ్ బాస్. ఐదు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో ప్ర‌స్తుతం ఆరో సీజన్ జ‌రుపుకుంటుంది. ఇందులో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు, హౌస్ మేట్స్ మధ్య గొడవలు, ఏడుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతోంది బిగ్ బాస్. కంటెస్టెంట్స్ ఆట తీరు..ప్రవర్తనలు మాత్రం ప్రేక్షకులకు రుచించడం లేదు. మొదటి రోజు నుంచి షో చప్పగా సాగుతుందనడంలో సందేహం లేదు. ప్రతి వారం హోస్ట్ నాగార్జున వచ్చి ఎంటర్టైన్ చేయండి అంటూ చివాట్లు పెడుతున్నా..కంటెస్టెంట్స్ ఆట తీరులో మాత్రం మార్పు రాలేదు. గ‌త‌వారం బిగ్ బాస్ చీవాట్లు పెట్ట‌డంతో కాస్త జోరు పెంచారు.

Advertisement

ఆదివారం బిగ్ బాస్ ఇంటిలో పండగ వాతావరణం నెలకొంది. హోస్ట్ నాగార్జున దీపావళి సందర్భంగా ఆడియన్స్ కి , కంటెస్టెంట్స్ కి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. వేదికపై అందమైన తారలు కాలు కదిపారు హైపర్ ఆది కామెడీతో పాటు హీరో కార్తీ ఎంట్రీ అలరించారు. ఇక ర‌ష్మీ ఖిలాడి చిత్రం లోని ”అట్టా చూడకే” సాంగ్ కి రష్మీ డాన్స్ చేశారు. రష్మీ డాన్స్ చేస్తున్నంత సేపు బిగ్ బాస్ వేదిక ఊగిపోయింది. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అయ్యారు. ఆమె పెర్ఫార్మన్స్ కి ఫిదా అయ్యారు. దివాళి స్పెషల్ ఎపిసోడ్లో రష్మిక స్పెషల్ సాంగ్ నిజంగా అద్భుతం చేసింది. ఆదివారం ఈ ఎపిసోడ్ చాలా సంద‌డిగా సాగ‌గా, చివ‌ర‌లో అర్జున్ ఎలిమినేట్ అయి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

Advertisement
arjun kalyan reveals the secret
arjun kalyan reveals the secret

Bigg Boss 6 Telugu : సీక్రెట్ రివీల్..

ఇక‌ బిగ్‌బాస్‌ స్టేజి పైకి వచ్చి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వడంతో శ్రీసత్య ఎమోషనల్ అయింది. శ్రీసత్య ఏడవడంతో అర్జున్ కళ్యాణ్ కూడా ఏడ్చాడు. నేను బిగ్‌బాస్‌ రావడానికి మెయిన్ కారణం శ్రీసత్యనే. బిగ్‌బాస్‌ మొదలవ్వక ముందు శ్రీసత్యకి నేను ఒక సినిమా ఆఫర్ చేశాను. డేట్స్ లేవు, చెయ్యను అని చెప్పింది. ఎందుకు అని అడిగితే బిగ్‌బాస్‌ కి వెళ్తున్నాను అని చెప్పింది. దీంతో నేను కూడా బిగ్‌బాస్‌ కి అప్లై చేయడంతో అదృష్టం బాగుంది వచ్చింది. నాకు బిగ్‌బాస్‌ ఆఫర్ రాగానే ఇంట్లోవాళ్ళకి చెప్పకుండా మొదట శ్రీసత్యకే ఫోన్ చేసి చెప్పాను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీనికి శ్రీసత్య స్పందిస్తూ అసలు ఈ విషయం ఇప్పటిదాకా నాకు తెలీదు అని చెప్పింది.

Advertisement