BalaKrishna : ఇంత వ‌ర‌కు ఎప్పుడు చేయ‌ని ప‌ని చేస్తున్న బాల‌య్య‌.. నోరెళ్ల‌పెడుతున్న నెటిజ‌న్స్

Advertisement

BalaKrishna : నంద‌మూరి బాల‌కృష్ణ స్పీడ్ ఇప్పుడు మాములుగా లేదు. ఆయ‌న ఏది ప‌ట్టుకుంటే అది బంగారంలా మారుతుంది. బాల‌కృష్ణ సినిమాలు, డిజిట‌ల్ షోస్‌తో స‌త్తా చాటుతున్నాడు. వెండితెర‌పై ఆయ‌న చేయ‌ని ప్ర‌యోగాలు లేవు. జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రక చిత్రాలలో నటించి తెలుగు సినీ గడ్డపై తనదైన ముద్ర వేసుకున్నారు బాలకృష్ణ. ప‌రిస్థిత‌లుకి అనుగుణంగా ఆయ‌న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోతో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఊహించని విధంగా ఈ షో రేటింగ్ ను పెంచేశాడు. ఈ షోతో బాలయ్య నడుచుకున్న తీరుతో అభిమానులకు, ఆడియెన్స్ కు మరింత నచ్చేశారు బాలయ్య. ఈక్రమంలో బాలకృష్ణ తాజాగా అడ్వర్టైజ్ మెంట్ ప్రపంచంలోకి కూడా అగుడుపెట్టినట్టు తెలుస్తోంది.

Advertisement

ప్రముఖ సాయి ప్రియా గ్రూప్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా బాలకృష్ణను ఎంపిక చేశారని తెలుస్తోంది ఈ సంస్థలోని ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేసేందుకు శ్రేయాస్ గ్రూప్ మరియు బ్రాండ్ ఈ డిజిటల్ వారు యాడ్స్ ను క్రియేట్ చేస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో బాలయ్య తొలిసారిగా యాడ్ షూట్ లో నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంద‌ని అంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ కాంబోలో NBK107 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.షూటింగ్ మొదలై ఇంతకాలం అయినా ఇప్పటిదాకా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయలేదు మేకర్స్. టైటిల్ ను మొదటి నుండి సస్పెన్స్ గానే ఉంచారు. అయితే ఇప్పుడు దీపావళి కానుకగా NBK107 టైటిల్ ను వీరసింహా రెడ్డిగా ప్ర‌క‌టించారు.

Advertisement
bala krishna first time shows intrest on ads
bala krishna first time shows intrest on ads

BalaKrishna : తొలిసారి ర‌చ్చ‌..

ఫస్ట్ టైమ్ సీమలో ఉన్న ఐకానిక్ ప్లేస్ కొండా రెడ్డి బురుజు వేదికగా అక్టోబర్ 21న సాయంత్రం 8:15 నిముషాలకు, NBK107 టైటిల్ ను లాంచ్ చేసారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య సరసన,శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్, తమిళ్ క్రేజీ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల మంచి ఊపుమీద ఉన్న తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

Advertisement