Bandla Ganesh : కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే బండ్ల గణేష్ అప్పుడప్పుడు తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ తాజాగా ఓ ఇంటర్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పూరీ జగన్నాథ్ పై ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇప్పుడు త్రివిక్రమ్‌కి సంబంధించి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య కాలంలో పూరీ – బండ్ల మధ్య పరోక్షంగానో, డైరెక్ట్ గానో మాటల యుద్ధం నడుస్తున్నట్లు తెలుస్తోంది. చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ విమర్శలు చేసిన బండ్ల గణేష్ ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో కూడా కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ ఈవెంట్లో బండ్ల గణేష్ ఎంట్రీ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్పీచు కోసం పవన్ కళ్యాణ్ ఈవెంట్లకు వచ్చే అభిమానులు కూడా ఉంటారు.దాదాపు పవన్ కళ్యాణ్ ప్రతి ఈవెంట్లో బండ్ల గణేష్ స్పీచ్ తప్పక ఉంటుంది. వకీల్ సాబ్ ఈవెంట్లో బండ్లన్న స్పీచ్ ఎఫెక్ట్ బాగానే పని చేసింది. పవన్ కళ్యాణ్ స్పీచ్ కంటే.. బండ్లన్న ప్రసంగానికే నాడు ఎక్కువ మార్కులు పడ్డాయి. దీంతో భీమ్లా నాయక్ ఈవెంట్‌కు బండ్లన్నను దూరం పెట్టేశారట. భీమ్లా నాయక్ ఈవెంట్ కోసం బండ్లన్న స్పీచ్ రెడీ చేసుకున్నాడట. తన దేవుడిని పొగిడేందుకు కొన్ని లైన్స్ రాసుకున్నాడట. కానీ చివర్లో త్రివిక్రమ్ ట్విస్ట్ ఇచ్చాడట.

Bandla Ganesh : ఒప్పేసుకున్నాడుగా..
త్రివిక్రమ్ తనను ఈవెంట్‌కు పిలవొద్దని అన్నాడట. బండ్ల గణేష్ వస్తే.. స్పీచ్ ఇస్తే తన ప్రభావం అంతగా ఉండకపోవచ్చని త్రివిక్రమ్ అనుకున్నాడట. అందుకే తనను ఈవెంట్‌కు పిలవలేదని, వాడు వీడూ అంటూ త్రివిక్రమ్‌ను నానా రకాలుగా తిట్టేశాడు బండ్ల గణేష్. ఈ మేరకు ఓ ఆడియో ఫైల్ వైరల్ అయింది. అప్పుడు అయితే అది తన వాయిస్ కాదని బండ్లన్న బుకాయించాడు. కానీ ఇప్పుడు అది తన వాయిసే అని ఒప్పేసుకున్నాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రివిక్రమ్‌ని తిట్టిన వాయిస్ నాదే. అప్పుడేదో కోపంలో తిట్టాను. దానికి ఆయనకు సారీ కూడా చెప్పాను అని బండ్ల గణేష్ అన్నారు. మొత్తానికి ఈ విషయం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.