Bandla Ganesh : పోసాని దారుణ‌మైన చావు చ‌స్తాడంటున్న బండ్ల గణేష్‌.. ఏమైంది అస‌లు..!

Advertisement

Bandla Ganesh : బండ్ల గ‌ణేష్ .. ఏం మాట్లాడిన కూడా సంచ‌ల‌నం. ఆయ‌న ఎప్పుడు ఎవ‌రిని టార్గెట్ చేస్తాడో చెప్ప‌డం చాలా క‌ష్టం. ఇది వరకు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గ‌ణేష్‌.. పూరి భార్యను లావణ్యను పొగుడుతూ ర్యాంపులు, వ్యాంపులు వస్తారు పోతారు అని, అలాగే ఆకాష్ ను మెచ్చుకుంటూ.. కన్న కొడుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుని ఏం చేస్తున్నావ్ అన్నా.. అంటూ దారుణ‌మైన కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ మరోసారి పురిపై ఫైరింగ్ కామెంట్స్ చేశారు. పూరి జగన్నాథ్ నా ఫ్రెండ్ అంటూనే భార్యాపిల్లల మ్యాటర్ తీస్తూ రెచ్చిపోయారు.

Advertisement

తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతోంది. ఇంట‌ర్వ్యూయ‌ర్.. నాలుక జాగ్రత్తగా పెట్టుకో అని పూరి గారిని ఎందుకు అన్నారని బండ్ల గణేష్‌ని అడగడంతో.. భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషా అన్నా.. అంటూ బండ్లన్న ఓ రేంజ్ రియాక్షన్ ఇచ్చినట్లు ప్రోమో వీడియో కట్ చేశారు. ఈ వీడియోలో ముందుగా యాంకర్.. వ్యాపారాలు, వ్యాపకాలు చాలానే ఉన్నాయి కదా.. వాటిని పక్కన పెట్టి రాజకీయాలను ఎందుకు కెలుకుతున్నారు అని ప్రశ్నించగా.. నేను ఎక్కడ కెలికాను. నన్ను ఇరికించాలను చూడకు అంటూ కౌంట‌ర్ ఇచ్చాడు బండ్లన్న‌. పోసాని చావు మాములుగా ఉండదు అని అన్న బండ్లకు ఇలా చెప్పడానికి మీరెవరు..

Advertisement
bandla ganesh stunning comments on posani
bandla ganesh stunning comments on posani

Bandla Ganesh : ఏమైంద‌య్యా నీకు..

ఆయనకు కూడా ఓ కుటుంబం ఉంటుంది కదా.. అని యాంకర్ అడగడంతో నువ్ పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి అని అన్నాడు. పూరి అనే వాడికి మంచి చెడు చెప్పే రైట్ నాకుంది.. నా ఫ్రెండ్ అంటూ బండ్ల గ‌ణేష్ స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యాడు. అయితే అప్ప‌ట్లో బండ్ల చేసిన వ్యాఖ్య‌ల‌ని ఉద్దేశించి నేరుగా స్పందించకుండా మ్యూజింగ్స్ ద్వారా బండ్ల గణేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడనే విషయం తెలిసిందే. మ్యూజింగ్ కింద కామెంట్స్ చూస్తే ‘బండ్ల గణేష్ స్పీచ్ కి సంబంధించి గట్టి కౌంటర్ ఇచ్చాడు…’ అని చాలా మంది కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Advertisement