Junior NTR : స్వాతిముత్యం అనే సినిమాతో సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కొడుకు బెల్లంకొండ గణేష్ తెరంగేట్రం చేస్తున్నాడు. హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే తన అన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు. తాజాగా తన తమ్ముడు సురేశ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
దీంతో మూవీ యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్న సందర్భంగా ఈ సినిమా కోసం ప్రమోషన్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఈసందర్భంగా ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బెల్లంకొండ గణేశ్.. పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. మా అన్న కమర్షియల్ సినిమాలు చేయడం చూశా. కానీ.. నేను మాత్రం నా సొంత మార్క్ ఉండేలా సినిమాలు చేయాలనుకుంటున్నా. కొత్తదనంతో ఉన్న కథలు ఎంచుకుంటున్నా. సినిమాలో హీరో పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. అందుకే.. సినిమాకు స్వాతిముత్యం అనే పేరు పెట్టారు.

Junior NTR : కొత్తదనంతో ఉన్న కథలు ఎంచుకుంటున్నా
హీరో పాత్ర అమాయకంగా ఉన్నప్పటికీ మంచి మనసు ఉన్న వ్యక్తిత్వంతో సినిమా ఉంటుంది. ఈ సినిమా స్టోరీకి జనాలు చాలా సులభంగా కనెక్ట్ అవుతారు.. అని గణేశ్ తెలిపాడు. అయితే.. తాను ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా సెట్స్ కు వెళ్లాడట గణేశ్. అది ఆది సినిమా షూటింగ్. పాటలు అన్నీ ఆస్ట్రేలియాలో షూట్ చేశారు. అప్పుడు గడియారంలో సమయాన్ని ఎలా తెలుసుకోవాలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి నేను, మా అన్నయ్య నేర్చుకున్నాం. టైమ్ ఎలా చూడాలో నేర్పించినందుకు నేను, నా అన్నయ్య నుంచి 10 డాలర్లు వసూలు చేశాడంటూ గణేశ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.