Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ గేమ్ షో మస్త్ రంజుగా మారుతుంది. రోజురోజుకి కంటెస్టెంట్స్ మధ్య హీట్ బాగా పెరిగిపోతుంది. రెండు వారాలు హౌజ్‌మేట్స్ అంతా ప్రశాంతంగా ఉండడంతో తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. అయితే మంగళవారం ఎపిసోడ్లో జరిగిన విషయాలపై గీతూ, ఆదిరెడ్డి చర్చించారు. ఇనయ పిచ్చిగా అర్థం లేకుండా వాగుతుందంటూ కామెంట్లు చేశారు ఆదిరెడ్డి. కానీ ఇనయ కేవలం హైలైట్ కావడం కోసం కెమెరాల కోసం ఆమె ఇలా ప్రవర్తిస్తుందని, స్ట్రాటజీ ప్లే చేస్తుందని గీతూ చెప్పుకొచ్చింది. నేహా కూడా రేవంత్ మాటలపై హర్ట్ అయింది.
ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సమయంలో బిగ్ బాస్ `అడవిలో దొంగలు` అనే పేరుతో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈ కెప్టెన్సీ టాస్క్‌లో ఇంటి సభ్యులని రెండు గ్రూపులుగా విభజించారు. ఆదిరెడ్డి, మెరీనా, శ్రీ సత్య, ఫైమా, ఇనయ, చంటి, ఆదిత్య, రోహిత్, రాజ్‌లని పోలీసులుగా ఎంపిక చేయగా, .. దొంగల టీం సభ్యులుగా రేవంత్, ఆరోహి, సుదీప, వసంతి, నేహ, కీర్తి, శ్రీహాన్, సూర్య, అర్జున్‌లు ఉన్నారు. గీతు అత్యాశ ఉన్న వ్యాపారస్తులుగా గీతుని సెలెక్ట్ చేశారు. అలాగే.. పోలీస్‌ల హెడ్ గా ఆదిరెడ్డి.. దొంగల హెడ్‌గా సూర్యని సెలక్ట్ చేశారు. ఈ టాస్క్‌లో అడవి వస్తువులని దొంగలు దొంగిలించకుండా పోలీసులు దాచిపెట్టుకోవలసి ఉంటుంది.

Bigg Boss 6 Telugu : ఏందీ గోల..
ఇచ్చిన ఈ టాస్క్ లో అడవిలో కొన్ని వస్తువులుంటాయి వాటిని దొంగలు దొంగిలించి కూడబెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని వ్యాపారి వద్ద ఎక్కువ మొత్తాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలి. అదే సమయంలో దొంగలు వస్తువలు దొంగిలించకుండా పోలీసులు అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్ యమ రంజుగా సాగింది. ఉత్కంఠతకి గురి చేసింది. ఈ గేమ్ కి సంబంధించిన చర్చే హౌజ్‌లో హాట్ హాట్‌గా సాగడం విశేషం. ఎవరు ఏం చేసినా గీతూ మాత్రం తనదైనస్టయిల్లో రెచ్చిపోవడం మరో విశేషం. ఇక ఆది రెడ్డి కూడా తన వంతు ఏదో ట్రై చేశాడు. ఈ గేమ్ నేడు కూడా కొనసాగనుంది.