Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 ఎంత రంజుగా సాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ షో రోజురోజుకి మంచి వినోదం పంచుతుంది.ఈ రోజు ఆదివారం కావడంతో ఒక కంటెస్టెంట్ పక్కా ఎలిమినేట్ అవుతుంది. అది ఎవరా అనే సందేహం అందరిలో ఉంది. మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండగా.. రేవంత్ టాప్ ఓటింగ్‌తో సేవయినట్లు సమచారం. ఇక తను అనుకున్నది అనుకున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతున్న ఇనయ భారీ ఓటింగ్ సంపాదించి.. ఎలిమినేషన్ నుండి తప్పించుకుందని అంటున్నారు. శ్రీహాన్ యథావిదిగానే సేవ్ అయ్యాడని సమాచారం.
కీర్తి భట్‌కు టీవీ వీక్షకులతో పాటు సింపథీ ఓట్లు బాగా పడుతున్న నేపథ్యంలో ఆమె కూడా సేవ్ అయినట్టు తెలుస్తున్నట్టు సమాచారం. రాజ్, సత్య, అర్జున్ కళ్యాణ్ కూడా ఓ మోస్తరు ఓట్లతో డేంజర్ జోన్ నుండి తప్పుకున్నట్టు సమాచారం. ఈ సారి నామినేట్ అయిన కంటెస్టెంట్లలో సుదీప, ఆరోహిఎక్కువగా డేంజర్ జోన్లో ఉంటారని అంతా భావించారు. అయితే ఇప్పుడు జనాలు ఎవరిని బయటకు పంపించేశారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆరోహి ఇంటి నుంచి ఎలిమినేట్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Bigg Boss 6 Telugu : ఆరోహి ఔట్..
ఇంకొంత మంది అయితే రాజ్‌ను సీక్రెట్ రూంలోకి పంపించేశారు అని కూడా అంటున్నారు. మరి కొందరు అయితే సుదీప ఎలిమినేట్ అయిందని చెప్పుకుంటున్నారు. ఆరోహీ ఎలిమినేట్ అయిన తర్వాత ఆర్జే సూర్య ఆట బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆరోహీ తెలంగాణ యాసలో మాట్లాడే మాటలు మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ కి కొందరు ఫ్యాన్స్ అయ్యారు. కానీ ఆమె ప్రవర్తన కొందరికి చిరాకు తెప్పిస్తుంది. ఇక ఆరోహి మాట చాలా కటవుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె ఎవరిమీద అయిన సీరియస్‌గానే స్పందిస్తుంటుంది. తాజాగా నాగార్జునపై కూడా ఆరోహి ఏదో విషయంలో రెచ్చిపోయినట్టు తెలుస్తుంది.