Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షో అంటేనే అది పక్కా నాన్ ఫ్యామిలీ కార్యక్రమం అనే పేరు పడింది. అందుకు కారణం ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ చేసే రచ్చ. హౌజ్ లోకి వచ్చినప్పుడు ఎలాంటి పరిచయం లేకపోయిన కొద్ది రోజులకి పీకల్లోతు ప్రేమలో పడడం ఆ తర్వాత నానా రచ్చ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో ఆర్జే సూర్య చేస్తున్న రచ్చ దారుణంగా ఉంది. ముందుగా ఆరోహితో రాసుకు పూసుకు తిరిగిన సూర్య ఇప్పుడు ఇనయతో బాబోయ్ అనేలా చేస్తున్నాడు. వీరిద్దరి చేష్టలు హౌస్ లో రోజురోజుకి శృతి మించి పోతున్నాయి.
చిన్న సందుదొరికితే చాలు.. హగ్ చేసుకోవడం.. ఏడుస్తుంటే అడ్వాంటేజ్ తీసుకుని ఓదార్చేయడంతో ఇనయ మనోడికి పడింది.ఏంది ఈ రచ్చ.. బిగ్ బాస్ హౌజ్‌లో రోజురోజుకి వీరిద్దరి మధ్య జరుగుతున్న యవ్వారం అందరు నోరెళ్లపెట్టేలా చేస్తుంది. ఓ సందర్భంలో నన్ను వదిలి నువ్వు వెళ్లిపోతావా? అంటూ ఇనయని చెంప మీద కొట్టాడు సూర్య. ఆ తరువాత వీళ్ల రొమాన్స్ మాములుగా లేదు. సినిమాలు కూడా పనికి రావు. ముఖంలో ముఖం పెట్టి ముద్దులుపెట్టేసుకుంటూ.. ఇద్దరూ రెచ్చిపోయారు. అసలు వీళ్లు ఏడుస్తున్నది ఎందు కోసం.. ? వీళ్ల మధ్య ఇంత ఎఫెక్షన్ ఎప్పుడు మొదలైంది?

ఆరోహి ఉన్నప్పుడు ఆమెతో కొంత కెమిస్ట్రీ నడిపిన కూడా ఇంతగా అనిపించలేదు. కాని ఇనయతో మాత్రం మనోడు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ముద్దులతో ముంచేస్తూ హగ్గులతో నలిపేస్తున్నాడు. ఒకరినొకరు హగ్గులతో నలిపేసుకుంటుండగా, వీరి అరాచకానికి అడ్డు అదుపే లేకుండా పోయింది. నిన్నటి అర్ధరాత్రి తరువాత కూడా వీళ్లు ఒకే బెడ్‌పై పడుకుని.. కామకేళి మొదలుపెట్టారు. ఎవరూ లేకుండా.. ఆర్జే సూర్య ఇనయ ఒళ్లో తలపెట్టుకుని పడుకోవడం.. ఆమె డ్రెస్ సర్దుకుంటూ కనిపించింది. ఇదంతా చూస్తుంటే ఇదేదో నైట్ షో అన్నట్టుగానే కనిపిస్తుంది. రేటింగ్ తక్కువ వస్తుందని కంటెస్టెంట్స్‌తో కాస్త డోసు ఎక్కువ పెంచేలా ప్లాన్స్ చేశారా అంటూ అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి.