Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్షకులకి మంచి మజా అందిస్తుంది బిగ్ బాస్ సీజన్ 6. ఈ కార్యక్రమంలో 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా, కొందరు చాలా లేజీగా ఉంటూ సరైన గేమ్ ఆడడం లేదు. దీంతో వారందరికి శనివారం రోజు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకారు. బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీ సత్య, మెరినా రోహిత్, అభినయ, కీర్తి, శ్రీహాన్ ఇలా తొమ్మిది మందిని పక్కన పెట్టిన నాగార్జున మిగతా 12 మంది ముందుకు క్లాస్ పీకి ఆ తర్వాత ఆ తొమ్మిది మంది దగ్గరకు వెళ్లాడు. అస్సలు మీ ఆట గురించి మాట్లాడడమే వేస్ట్ అన్నట్టు నాగార్జున వారిపై గరం అయ్యాడు. శనివారం ఎపిసోడ్‌లో నాగ్ చాలా స్టైలిష్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చి శుక్రవారం హౌస్ లో ఏం జరిగిందో ఆడియన్స్ తో కలసి చూశారు. తాను ఎలిమినేట్ అవుతానేమో అని అభినయశ్రీ భయపడుతూ ఉంటుంది. శ్రీ సత్య ఆమెకి ధైర్యం చెబుతుంది.
ఇక హౌస్ మేట్స్ తో సీరియస్ గా ఇంటరాక్షన్ మొదలు పెట్టారు. ఎదుటివాళ్ళు గెలవకూడదు అని అని గేమ్ ఆడుతున్నావా అంటూ ఫైమాపై నాగ్ యాంగ్రీ అయ్యారు. చంటి జోకులు బాగా వేస్తున్నాడు కానీ ఇంకా ఆట ఆడడం లేదని అన్నారు. సూర్య బిగ్ బాస్ హౌస్ కి గేమ్ ఆడదానికి వచ్చినట్లు లేదు.. చిల్ కావడానికి వచ్చినట్లు ఉంది అని నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతూ గేమ్ అద్భుతంగా ఆడుతుందని ప్రశంసలు కురిపించారు. కెప్టెన్ అయిన రాజ్ ని నాగ్ అభినందించారు. కానీ కెప్టెన్ అయినా విధానం బాగాలేదు అని నాగ్ అన్నారు. ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేసి గెలిచావు అని నువ్వు ఇలా గెలవడం నాకు నచ్చ లేదు అని అన్నారు. ఇలా ఒక్కొక్కరుగా క్లాస్ పీకుతూ వచ్చిన నాగార్జున కూర్చున్న 11 మంది నిలుచున్న వారిలో వేస్ట్ ఎవరు గేమ్ పరంగా అని స్టాంప్ వేసి డిసైడ్ చేయాలి.

Bigg Boss 6 Telugu : అంతా సస్పెన్స్..
అలా షానికి 3 ఓట్లు.. శ్రీసత్యకి 3, వాసంతికి 3 ఓట్లు వచ్చాయి. వీరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు అని నాగ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తొలి ఎలిమినేటర్‌గా షాని ఎలిమినేట్ అయినట్టు నాగార్జున చెప్పుకొచ్చారు.దీంతో అందరు షాక్ అయ్యారు. అయితే షాని వేదికపైకి రాగా, అతనికి జర్నీ వీడియో చూపించలేదు. హౌజ్‌మేట్స్‌తో ఇంటరాక్షన్ చేయించలేదు. చూస్తుంటే ఇది ఎలిమినేషన్‌లా అనిపించడం లేదు. ఆయనని ఏదో సీక్రెట్ రూంలోకి పంపారా అని అనిపిస్తుంది. ఇక వేదికపైకి నాగ్ సతీమణి అమల, హీరో శర్వానంద్ ఎంట్రీ ఇచ్చారు. ఒకే ఒక జీవితం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరూ బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. రేవంత్.. అమల కోసం ‘ హలో గురు ప్రేమ కోసమే జీవితం’ అంటూ పాట పాడి అలరించారు