Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీసన్ 6 ఇటీవలే ఘనంగా ప్రారంభమై సక్సెస్ ఫుల్‌గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నాలుగో వారం జరుపుకుంటుండగా, ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎంత రచ్చగా మారిందో మనం చూశాం. పోటా పోటీగా మారిన నామినేషన్ ప్రక్రియలో మొత్తం పది మంది నామినేట్ అయ్యారు. వారం బిగ్ బాస్ చరిత్ర లో మొట్టమొదటిసారిగా హోస్ట్ నాగార్జున .. కీర్తి మరియు అర్జున్ లను నేరుగా హౌస్ నుండి బయటకి వెళ్లిపోవడానికి నామినేట్ చేసాడు..వీళ్లిద్దరు కాకుండా సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో రేవంత్ ,ఇనాయ సుల్తానా, శ్రీహాన్ ,గీతూ, రాజ్ శేఖర్, సుదీప ,సూర్య మరియు ఆరోహి నామినేట్ అయ్యారు..అయితే గడిచిన మూడు వారాలతో పోలిస్తే ఈ వారం లో వోటింగ్ మొత్తం తారుమారైంది.
మంగళవారం బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా . `హోటల్ వర్సెస్ హోటల్` టాస్క్ ఇచ్చారు. ఇందులో `బీబీ హోటల్`, `గ్లామ్ హోటల్` అనే రెండు హోటల్స్ ఉండనుండగా, ఇందు లో కంటెస్టెంట్ల సర్వెంట్లుగా, చెఫ్‌లుగా, గెస్ట్ లుగా వ్యవహరిస్తారు. చంటి హెల్పర్‌గా ఉండాల్సి ఉంటుంది. పైగా ఆయనకు ఓ సీక్రెట్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. గ్లామ్ హోటల్లో ఐదుగురు అమ్మాయిలు పనిచేస్తుంటారని బిగ్ బాస్ చెప్పగా, వారిలో ఫైమా మేనేజర్ కాగా, శ్రీసత్య, ఆరోహి, కీర్తి, వసంతి సర్వెంట్లు. ఇక బీబీ హోటల్లో సుదీప మేనేజర్ కాగా, రేవంత్, బాలాదిత్య, గీతూ, మరీనా సర్వెంట్లు.

Bigg Boss 6 Telugu : కెప్టెన్సీ రచ్చ..
ఇనయ రాజకుటుంబంలో పుట్టిన ఒంటరి అమ్మాయి. రోహిత్ భార్య పారిపోవడంతో ఆమె కోసం వెతుక్కుంటూ వచ్చిన అతిథి, శ్రీహాన్ హీరో, పేరు కోసం ప్రయత్నిస్తుంటారు. సూర్య మతిస్థితిమితం సరిగా లేదని వ్యక్తి. ఆది ఫుడ్ రివ్యూవర్. రాజ్, అర్జున్ తీయబోయే సినిమా కోసం లోకేషన్ చూడ్డానికి వచ్చిన వారు. ఈ టాస్క్ లో గెస్ట్ లు సర్వెంట్ల చేత పనిచేయించుకుని డబ్బులివ్వాలి, హోటల్ స్టాఫ్ పనిచేసి, ఫుడ్ పెట్టి గెస్ట్ ల నుంచి డబ్బులు పొందాలి. ఎక్కువ డబ్బులు ఉన్న వారి కెప్టెన్ కి పోటీదారులవుతారని బిగ్ బాస్ చెప్పగా, ఎవరికి వారు తమ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. కొందరైతే రోత పనులు చేస్తూ విసుగు పుట్టేలా చేశారు. అర్జున్ అయితే ఏకంగా షర్ట్ విప్పి మసాజ్ చేయించుకున్నాడు. రోజురోజుకి ఈ షో మరింత రచ్చగా మారుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.