Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న షో బిగ్ బాస్ సీజన్ 6. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా లాంచ్ అయింది. 21 మంది కంటెస్టెంట్స్‌ని ఒక్కొక్కరిగా వేదిక మీదకు పిలుస్తూ వారి వివరాలు చెప్పుకొచ్చారు నాగ్. ఇక లాంచింగ్ రోజు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కూడా షోలో పాల్గొని తమ సినిమా ప్రమోషన్స్ చేపట్టారు. సీజన్ 6లో ప్రారంభ ఎపిసోడ్‌తో దారుణ పరాభవం ఎదురైంది. ఫస్ట్ ఎపిసోడ్‌తోనే దారుణమైన రేటింగ్ సంపాదించుకుంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన నాలుగోసీజన్ ఫస్ట్ ఎపిసోడ్ హయ్యెస్ట్‌గా 18.5 టీఆర్పీ రేటింగ్స్‌తో టాప్ ప్లేస్‌లో నిలవగా, సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ 17.9 టీఆర్పీ రేటింగ్ సాధించింది.
ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్ వన్ ఫస్ట్ ఎపిసోడ్ 16.8 టీఆర్పీ రేటింగ్ సాధించింది. దారుణాతి దారుణం.. తాజా నివేదికల ప్రకారం నివేదికల ప్రకారం, టీఆర్పీ 8.86 గా ఉంది. ఇది చాలా షాకింగ్ టీఆర్పీ రేటింగ్ అని చెప్పాలి. జనాలకు పెద్దగా తెలియని కంటెస్టెంట్స్ కావడం, బిగ్ బాస్ నాన్ స్టాప్ కు, సీజన్ 6 కు మధ్య గ్యాప్ ఎక్కువగా లేకపోవడమే టీఆర్పీ రేటింగ్ తగ్గడానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు అదే రోజు పాకిస్తాన్ – ఇండియా మ్యాచ్ జరగడంతో సీజన్ 6 లాంచింగ్ ఎపిసోడ్‌పై ఎఫెక్ట్ పడిందని అంటారు. గత ఐదో సీజన్ నుంచి బిగ్ బాస్ పై ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గుతూ వస్తోందని చెప్పాలి.

తాజాగా వచ్చిన రేటింగ్స్‌లో కనీసం రేటింగ్ రెండు అంకెలు దాటకపోవడం ఈ షో భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బిగ్‌బాస్ సీజన్ 6లో రేవంత్, శ్రీహాన్, కీర్తిభట్, సుదీప, బాలాదిత్య, సింగర్ రేవంత్, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆర్జే సూర్య, అభినయశ్రీ, ఫైమా, చలాకీ చంటి, అర్జున్ కళ్యాణ్, రోహిత్ మరీనా, ఇనాయా సుల్తానా, గీతూ రాయల్, షానీ సాల్మన్, నేహా కంటెస్టెంట్స్‌గా ఉన్నారు.. తొలి వారంలో ఎలిమినేషన్ నుంచి నుంచి మినహాయింపు ఇచ్చాడు బిగ్ బాస్. రెండో వారం ఒకరు లేదా ఇద్దరు బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.