Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ తెలుగులో మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇటీవల సీజన్ 6 మొదలు పెట్టారు. 21 మంది కంటెస్టెంట్స్‌తో ఈ షో మొదలు కాగా, హౌజ్ నుండి ఇప్పటికే ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇటీవల నామినేషన్ రచ్చ సాగగా, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇందులో హౌజ్ మేట్స్ చేసే రచ్చ దారుణంగా ఉంది. వీరు సెలబ్రిటీలేనా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్.. చెరువులో చేపలు అనే టాస్కు ఇవ్వగా, ఇందులో అందరూ బాగా ఆటలో లీనమై దెబ్బలు తాకినా పట్టించుకోకుండా ఆడారు..ముఖ్యంగా ఈ టాస్కులో గీతూ, రేవంత్ , రోహిత్ మరియు మెరీనా బాగా హైలైట్ అయ్యారు..
గీతూ అందరికంటే తక్కువ చేపలను పట్టుకున్నా ప్రతి ఒక్కరిని రెచ్చ గొడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. చేపల చెరువు టాస్క్‌లో ఇంటి సభ్యులు జంటలుగా విడిపోయి గార్డెన్ ఏరియాలో కురిసే చేపల వర్షంలో వీలైనన్ని చేపల్ని పట్టుకుని జాగ్రతపరుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత బిగ్‌బాస్ అడిగినప్పుడు అత్యంత తక్కువ చేపలు ఉన్న జంట పోటీ నుంచి నిష్క్రమిస్తుంది. మధ్య మధ్యలో బిగ్‌బాస్ ఇచ్చే ఛాలెంజ్‌లో గెలిచిన సభ్యులు తమ వద్ద ఉన్న చేపల సంఖ్యని పెంచుకోవచ్చు. ప్రతి ఛాలెంజ్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకోవడానికి హారన్ మోగినప్పుడు ప్రతి జంటలో ఒక సభ్యుడు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పూల్‌లో దిగి అందులో ఉన్న గోల్డ్ కాయిన్ని వెతకాల్సి ఉంటుంది.

Bigg Boss 6 Telugu : ఏందా బూతులు..
ఈ టాస్క్‌లలో గీతూ, కీర్తిలకు అయితే గట్టిగానే దెబ్బలు తాకాయి..మూడవ రౌండ్ లో చేపలను పట్టుకునే ప్రక్రియ లో రేవంత్ గీతూ ని నెట్టివేయడం తో ఆమె క్రిందపడి కాలుకి దెబ్బ తాకడం తో ఆ కోపంలో ‘నీ అబ్బా రేయ్’ అంటూ రేవంత్ ని అంటుంది..అప్పుడు రేవంత్ ‘ఏయ్ ఏంటి వాగుతున్నావ్’ అని గీతూ మీదకి వెళ్లడం తో గీతూ ‘నా కాలుకి బలంగా దెబ్బ తాకింది’ అని గట్టిగా అరుస్తుంది. మరో సందర్భంలో రేవంత్ నీయమ్మ అని అన్నట్టు వినిపిస్తుంది. ఏదేమైన వీళ్ల ఆట ఏమో కాని చేసే రచ్చతో హైలైట్ అవుతున్నారు.