Bigg Boss Nandini Rai : నందిని రాయ్ తెలుసు కదా. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా తను చాలా సినిమాల్లో నటించినా తనకు అంతగా గుర్తింపు రాలేదు కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వెళ్లిందో అప్పటి నుంచి తనకు వచ్చిన గుర్తింపు మామూలుగా కాదు. ఆ తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయి. చాలా పాపులర్ అయింది నందిని రాయ్.
ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది నందినీ రాయ్. ఆమె వెబ్ సిరీస్ లే తనకు చాలా గుర్తింపును తీసుకొచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 2 తర్వాత తనకు చాలా క్రేజ్ వచ్చింది. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే.. తను ఏ సినిమాలో నటించినా.. రెచ్చిపోతుంది. గ్లామర్ డోస్ ను పెంచుతుంది. ఏమాత్రం దాచుకోకుండా అందాలను చూపిస్తుంది. అందుకే తనకు కూడా అటువంటి క్యారెక్టర్లే ఎక్కువగా వస్తున్నాయి.

Bigg Boss Nandini Rai : తిరుమలకు మోకాళ్లతో మెట్లు ఎక్కిన నందిని రాయ్
సాధారణంగా ఎవరైనా తిరుమలకు వెళ్తే బస్సులో వెళ్తారు.. లేదంటే తమ సొంత వాహనాల్లో వెళ్తారు. కొందరు తమకు మొక్కు ఉంటే మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తారు. కానీ.. నందినీ రాయ్ మాత్రం తనకు ఏం మొక్కు ఉందో తెలియదు కానీ.. మోకాళ్ల మీద నడుచుకుంటూ వెళ్లి తిరుమలకు చేరుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సెలబ్రిటీ అయి ఉండి.. తన హోదాను ఉపయోగించుకోకుండా మోకాళ్లతో తిరుమల మెట్లను ఎక్కడంపై నెటిజన్లు తనను మెచ్చుకుంటున్నారు. చాలమంది ఏదైనా బలమైన కోరిక ఉంటేనే అలా మోకాళ్లపై తిరుమల కొండను ఎక్కుతారు. నందిని రాయ్ మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కడంపై చాలామంది అభినందిస్తున్నారు. వావ్.. ఆ ప్లేసే ఒక అద్భుతం. అద్భుతమైన అనుభూతిని పొందాను అంటూ ఆ వీడియోను షేర్ చేసింది నందినీ రాయ్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.