Bindu Madhavi : బిందు మాధవి మోడలింగ్ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఇక తెలుగులో కొన్ని సినిమాలు చేసిన అంత మెప్పు పొందలేకపోయింది. పేరుకు తెలుగు అమ్మాయి అయినా తన టాలెంట్ ను ఇక్కడ ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఇక టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి కోలీవుడ్ లో అడుగు పెట్టింది ముద్దుగుమ్మ. కోలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్గా పేరుపొందింది. ఇక ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది బిందు మాధవి.ఆల్రెడీ కోలీవుడ్ లో కూడా బిగ్ బాస్ కు వెళ్లి ఫైనల్ కు చేరుకోలేకపోయింది.
కాని అక్కడ వచ్చిన పాపులారిటీతో తెలుగు బిగ్ బాస్ లోకి ఎంటర్ అయింది. అలాగే బిగ్ బాస్ ఓటీటీ ద్వారా అభిమానులకు చాలా దగ్గరై ట్రోపి ని అందుకుంది. అలాగే బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటిసారి ట్రోపి అందుకున్న అమ్మాయిగా పేరు సంపాదించింది.ఇక దీంతో అమ్మడుకు తెలుగులో కూడా అవకాశాలు క్యూ కడతాయని అందరూ భావించారు.తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే బాలకృష్ణ ,అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. హౌస్ నుంచి బయటికి వచ్చాక అసలు నిజం బయటపడింది . ఇప్పటివరకు తనకు తెలుగు నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఆఫర్ రాలేదట. కాని కోలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడుకు ఒక బంపర్ ఆఫర్ తగిలిందంట. ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలో బిందు మాధవి ఒక ఇంపార్టెంట్ రోల్ ను చేయబోతుందట.

ఈ సినిమాలో బిందు మాధవి లేడీ ఓరియంటెడ్ పాత్రలో కనిపించబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ తల్లి బిడ్డ కోసం పడే తాపత్రయం… ఆ బిడ్డ చేయి జారిపోతే ఎలా ఉంటుందో.. దానికి కారణమైన వాళ్లపై రివెంజ్ ఎలా తీసుకుంటుందో… అన్న కాన్సెప్ట్ పై ఈ మూవీ రాబోతుందని సమాచారం. ఈ మూవీలో 12 ఏళ్ల పాపకు తల్లిగా నటించబోతుంది బిందు మాధవి. నిజానికి బిందు మాధవి ఫిగర్ కి, తన పర్సనాలిటీ కి తల్లి క్యారెక్టర్ సూట్ అవ్వదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే తన అవకాశాలు ఇంకా తగ్గిపోతాయని అంటున్నారు మరికొందరు.ఇక ఆమె తీసుకోబోయే నిర్ణయం ఏమిటో వేచి చూడాల్సిందే.