Prabhas : మోహన్ రాజా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల గాడ్ ఫాదర్ (Godfather ) సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సాధించాడు. ఈ సినిమాను మలయాళం లోని లూసిఫర్ చిత్రం ఆధారంగా రిమేక్ చేశాడు. మోహన్ రాజ కెరియర్లో ఎక్కువగా రీమిక్ లే ఉంటాయని చెప్పవచ్చు. అయితే తెలుగులో ఇతడు హనుమాన్ జంక్షన్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. దీన్ని ఓ మలయాళం హిట్ ఆధారంగా తరకెక్కించాడు. ఇక తర్వాత నుండి తమిళ్ సినిమాలను రీమేక్ చేస్తూ వచ్చాడు. తెలుగులో విజయం సాధించిన జయం , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఆజాద్, ఇలా చాలా సినిమాలను రీమేక్ చేసి విజయం సాధించాడు మోహన్ రాజా (Mohan Raja ).
ఆ తర్వాత తన సొంత కథతో తన తమ్ముడి హీరోగా పెట్టి తనీ ఒరువన్ అనే సినిమాను తీశాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచి మోహన్ రాజా పేరును మార్మోగేలా చేసింది. మోహన్ రాజా కెరియర్ ను మలుపు తిప్పిన సినిమాగా తనీ ఓరువన్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు మొదటిగా ప్రభాస్ ను అనుకున్నాడట మోహన్ రాజా. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో మోహన్ రాజా స్వయంగా వెల్లడించాడు. ఈ సినిమా కోసం 2010లో ప్రభాస్ ను కలిసి తనీ ఓరువన్ కథ ను చెప్పగా ఈ కథ ప్రభాస్ కి బాగా నచ్చిందట .

అయితే అప్పుడు కేవలం అవుట్ లైన్ మాత్రమే చెప్పానని , ఇక తర్వాత ప్రభాస్ ఇలాంటి యాక్షన్ మూవీ కాకుండా ఒక ఫ్యామిలీ కథనం కోరుకుంటున్నాడని చెప్పడంతో ఇక ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయని ఇక ఆ తర్వాత తన తమ్ముడితో ఈ సినిమాను చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు మోహన్ రాజా. ఇది ఇలా ఉండగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా ప్రభాస్ చేసి ఉంటే బాగుండేది అని కామెంట్ చేస్తున్నారు.