Sonali Bendre : సోనాలి బింద్రే తెలుసు కదా. తను బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి తెలుగులోనూ స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించింది. అయితే.. కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడే తనకు క్యాన్సర్ సోకింది. దీంతో క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం చాలా ఏళ్ల పాటు తను ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. సోనాలి బింద్రే తెలుగులో మహేశ్ బాబు, శ్రీకాంత్, చిరంజీవి సరసన పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

మురారి, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాల్లో తన పాత్రలు తనకు చాలా పేరు తెచ్చిపెట్టాయి. పెళ్లి చేసుకున్నా అడపా దడపా సినిమాల్లో నటించిన సోనాలీ ఆ తర్వాత క్యాన్సర్ నుంచి కోలుకున్నాక మళ్లీ తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించింది. తను ఎంతో ధైర్యంగా క్యాన్సర్ తో పోరాడి గెలవడంతో తనను అందరూ మెచ్చుకున్నారు.
Sonali Bendre : మనీష్ మల్హోత్రా బర్త్ డే వేడుకల్లో సొనాలి
మనీష్ మల్హోత్రా బర్త్ డే వేడుకల్లో తాజాగా సోనాలి బింద్రే పాల్గొన్నది. ఈనేపథ్యంలో తను కెమెరా కంటికి చిక్కింది. స్టయిలిష్ డ్రెస్ వేసుకొని వచ్చిన సోనాలి ఫోటోలకు పోజులు ఇచ్చింది. అప్పటికి ఇప్పటికి ఏమాత్రం తగ్గలేదు. అలాగే ఉంది. కొంచెం కూడా మారలేదు. ఎద అందాలను చూపిస్తూ మళ్లీ సోనాలి రెచ్చగొడుతోంది. తనను చూసి నెటిజన్లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఏంటి సోనాలి.. ఆ అందం.. ఈ వయసులో కూడా తను ఇంత అందాన్ని మెయిన్ టెన్ చేయడం గ్రేట్ అంటూ ఆ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.