Chalaki Chanti : బిగ్ బాస్ షో రోజురోజుకి ఆసక్తికరంగా మారుతుంది. హౌజ్‌మేట్స్ గేమ్ లో జోరు పెంచేస్తున్నారు. దీంతో షో రసవత్తరంగా మారుతుంది. శనివారం రోజు నాగార్జున హౌజ్‌మేట్స్‌కి ఫుల్ క్లాస్ పీకడంతో పాటు వారితో సరదా గేమ్స్ కూడా ఆడించాడు. అయితే తప్పు చేసిన వారికి గట్టిగానే క్లాస్ పీకాడు. సూర్య ఫుడ్ పడేయడంతో తీవ్రంగా క్లాస్ పీకాడు. కెప్టెన్‌గా ఆదిరెడ్డి విఫలమయ్యాడని, అదే సమయంలో ఆరోహిపై కోపంతో తాను ఫుడ్ పడేసినట్టు చెప్పిన సూర్యకి గట్టిగా క్లాస్ పీకాడు.
సూర్య మిస్టేక్ చేసిన క్రమంలో ఈ వారం అంతా ఆరోహితో మాట్లాడొద్దని చెప్పాడు నాగార్జున.ఇక ఆరోహికి నందు అనే లవర్ ఉన్నాడని, సూర్యకి బుజ్జమ్మ ఉందని వారిచేతే చెప్పించాడు. దీంతో ఇప్పటి వరకు తమ మధ్య ఏదో ఉందని అనుకున్నారని, దీంతో అన్నీ క్లీయర్ అయ్యాయని ఆరోహి అనడం విశేషం. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు ఎవరి విషయంలో ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. హౌస్‌లో ఒకే తప్పు నలుగురు చేసినప్పటికీ.. హౌస్మేట్స్ ఓట్ల ప్రకారం శిక్ష చంటికే పడింది. దీంతో ఈ సీజన్ మొత్తం అతడు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Chalaki Chanti : ఊకో.. ఊకో
ఈవారం బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కి ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చిన విషయం తెలిసిందే.టాస్క్ పూర్తయ్యే సరికి ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్లకు ఎక్కువ టిప్స్ వస్తాయి. అయితే, హౌస్‌లో నలుగురు కంటెస్టెంట్స్ దగ్గర ఒక్క పైసా కూడా మిగల్లేదు. ఆదిరెడ్డి, బాలాదిత్య, ఇయనా, చంటి.. దీంతో శనివారం నాటి ఎపిసోడ్లో ఈ నలుగురిని హోస్ట్ నాగార్జున నిలబెట్టారు. ఈ నలుగురిలో ఒక్కరు ఈ సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే అర్హత కోల్పోతారు అని సెలవిచ్చారు. ఆ ఒక్కరినీ సెలెక్ట్ చేయాల్సిన బాధ్యతను హౌస్‌మేట్స్‌కే ఇచ్చారు. దాంతో వారు చంటికి ఓటేశారు. అసలే సీక్రెట్ టాస్క్ పోయిందనే బాధలో ఉన్న చంటి ఇప్పుడు సీజన్ మొత్తం కెప్టెన్‌గా ఉండే అవకాశాన్ని కోల్పొయాడు.