Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్ లో జబర్దస్త్ చంటి పరమ చెత్త పని.. సిగ్గు ఉందా అసలు?

Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇక బిగ్ బాస్ అంటేనే సాధారణంగా ట్విస్టులు ఉంటాయి. ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో తెలియదు. హౌస్ లోకి వెళ్లాక ఆట మొదలెట్టాల్సిందే. గేమ్ ఆడాల్సిందే. అక్కడికెళ్లి ఊరికే అలా కూర్చొంటాం అంటే కుదరదు. ఏమాత్రం గేమ్ ఆడకపోయినా జనాలు ఎలిమినేట్ చేసేస్తారు. బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ కావాలంటే మామూలు విషయం కాదు.

Advertisement

హౌస్ మెట్స్ సరిగ్గా ఆట ఆడకపోతే జనాలే కాదు.. బిగ్ బాస్ కూడా ఊరుకోడు. ప్రతి శని, ఆదివారాల్లో వచ్చే హోస్ట్ నాగార్జున కూడా ఊరుకోడు. నాగ్ అయితే ఏకంగా వార్నింగ్ లు ఇచ్చి వెళ్తాడు. అందుకే.. బిగ్ బాస్ హౌస్ లో ప్రతి క్షణాన్ని ఎంతో జాగ్రత్తగా గడపాలి. చాలా అలర్ట్ గా ఉండాలి. అయితే.. గత వారం బిగ్ బాస్ ( Bigg Boss )హౌస్ లో హౌస్ మేట్స్ కు రూ.5 వేలు ఇస్తారు. ఆ తర్వాత టాస్క్ ఇస్తారు. టాస్క్ అయ్యేలోపు ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్లకే ఎక్కువ టిప్స్ వస్తాయి.

Advertisement
chalaki-chanti-can-not-become-captain-in-bigg-boss-season-6
chalaki-chanti-can-not-become-captain-in-bigg-boss-season-6

Bigg Boss 6 Telugu : నలుగురు కంటెస్టెంట్ల దగ్గర ఒక్క పైసా మిగల్లేదు

హౌస్ లో నలుగురు కంటెస్టెంట్ల దగ్గర మాత్రం ఒక్క పైసా కూడా మిగలలేదు. వాళ్లు ఆదిరెడ్డి, బాలాదిత్య, ఇనయా, చంటి (chalaki chanti ). ఈ నలుగురి దగ్గర సున్నా డబ్బులు ఉండటంతో వీళ్లకు ఒక పనిష్ మెంట్ ఇస్తాడు నాగార్జున. వీళ్లలో ఒక్కరికి ఈ సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే అర్హత ఉండదు అని హోస్ట్ నాగార్జున చెబుతాడు. ఆ ఒక్కరిని హౌస్ మెట్స్ సెలెక్ట్ చేయాలి. అందరూ కలిసి చంటికి ఎక్కువ ఓట్లు వేయడంతో చంటి ఈ సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే చాన్స్ ఉండదు. నిజానికి.. చంటి, ఇనయాకు సమానంగా ఓట్లు పడటంతో.. చంటి కెప్టెన్ కాకుండా ఉండేలా కెప్టెన్ గా ఉన్న కీర్తి తన ఓటు వేస్తుంది. దీంతో చంటి ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే అర్హతను కోల్పోతాడు. ఈ విషయం తెలియగానే చంటి కొంచెం డిస్టర్బ్ అవుతాడు. నిరుత్సాహపడటంతో చంటిని హోస్ట్ నాగార్జున మోటివేట్ చేస్తాడు.

Advertisement