BIgg Boss 6 Telugu : స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చాలా రసవత్తరంగా సాగుతుంది. ఈ సీజన్ స్టార్ట్ అయి ఆరు వారాల దాకా కావస్తుంది. ఇక 20 ఒక్క మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టిన ఈ హౌస్ లో 5 వారాల్లో 5 ఎలిమినేషన్స్ అయ్యాయి. అయితే ఇటీవల జరిగిన ఐదవ వారం ఎలిమినేషన్ లో అనూహ్యంగా చలాకి చంటి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే అయిదో స్థానంలో ఉండి చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అయినా చలాకి చంటి ఎలిమినేట్ కావడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీనికి గల కారణం ఆయన ఆట తీరు , పర్ఫామెన్స్ మరియు హౌస్ లో ఏం తినకుండా పస్తులు ఉండటం లాంటివని తెలుస్తుంది.అయితే ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ ను బిగ్ బాస్ కేఫ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారన్న సంగతి మనకు తెలిసిందే.
దీనిలో భాగంగా ఇటీవల ఎలిమినేట్ అయినా చలాకి చంటిని యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు. ఇక ఈ క్రమంలో బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్ చేశాడు చలాకి చంటి.అలాగే ఇంటర్వ్యూలో యాంకర్ శివ మరియు చలాకీ చంటిల మధ్య జరిగిన సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారాయి.బిగ్ బాస్ ప్రారంభం రోజున బిగ్ బాస్ చరిత్ర తాకాలంటే ఈ చంటిసారుడి కత్తిలాంటి పంచులు దాటాలని చంటి అన్నాడు.అయితే యాంకర్ శివ ,బిగ్ బాస్ ప్రారంభం రోజున ప్రోమోలో డైలాగులు చూపించి ,ఇలాంటి పంచులు తర్వాత బిగ్ బాస్ హౌస్లో వేశారా అని వెటకారంగా అడిగాడు. దానికి చలాకి చంటి ఆ వేశాను అంటూ ఆన్సర్ ఇచ్చాడు.

ఆ తర్వాత అసలు జనాలకి చాలాకి చంటి ఏమైపోయాడు అని శివ అనగా … ఇది నువ్వుగా అంటున్నావా లేదా జనం తరపున అంటున్నావా అని చలాకి చంటి అంటాడు. జనం తరపున జనంలో ఒకటిగా అడుగుతున్నానని శివ చెబుతాడు. దానికి చలాకి చంటి స్పందిస్తూ నీకు ఏ జనం చెప్పారో ఆ లిస్ట్ ఇస్తే ఆ జనం ముందు కూర్చుని మాట్లాడదామని జవాబు ఇచ్చాడు.ఆ తర్వాత నాకు ఇప్పటిదాకా అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఆట అంటే బీయింగ్ ఫేక్ అని అన్నాడు చంటి. నువ్వు కూడా అలాగే ఆడావు అని యాంకర్ శివను అన్నాడు.ఆ తర్వాత ఆడియన్స్ తీసుకున్న డిసిషన్ రైట్ ఆర్ రాంగ్ అని చంటిని శివ అడగగా ,ఓటు వేసిన వాళ్లకే తెలియాలి అని చంటి జవాబు ఇచ్చాడు. దీంతో ఎపిసోడ్ ప్రోమో ముగిసింది. మరిన్ని విషయాలు తెలియాలంటే ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.