Actress Childhood Photos : ఈ మధ్యకాలంలో త్రో బ్యాక్ పేరుతో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఓ సెలబ్రెటీ చిన్ననాటి ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఆ ఫోటోలో ఉన్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా? 2018లో ఇయర్ ఆఫ్ ది ఇండియన్ సెలబ్రిటీగా అందరి మనసులను దోచుకుంది. ఆ టైంలో ఈమె కోసం అందరూ గూగుల్ లో సెర్చ్ చేసేవారు. ఈ బ్యూటీ గురించి తెలుసుకోవాలని చాలామంది నెట్టింట తెగ వెతికేవారు. ఈ ముద్దుగుమ్మ కూడా సినిమా రిలీజ్ కాకముందే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. తెలుగులో చేసింది రెండు సినిమాలే కానీ బాగా ఫేమస్ అయ్యింది. ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఏం కలిసి రాలేదు. ఇక ఇప్పుడు హాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఇప్పుడు హీరోయిన్ గా చాలా బిజీ అయిపోయింది. ఎంత బిజీగా ఉన్న కొంచెం టైం దొరికితే సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంటుంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే తను ఇచ్చిన ఒకే ఒక్క ఎక్స్ ప్రెషన్ తో అందరు చూపులను తన వైపు తిప్పుకుంది. అప్పట్లో ఆ సీన్ తెగ వైరల్ అయింది. ఇక అప్పటి వరకు చిన్న పాత్రను ఇచ్చిన దర్శకుడు సైతం ఆమె క్యారెక్టర్ లెంత్ ను పెంచేశాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంట ఆ హీరోయిన్ ఎవరో. అవును తను ఎవరో కాదు ప్రియా ప్రకాష్ వారియర్. దిష్టి తగలకుండా బుగ్గన చుక్కతో , గడ్డం కింద చేయి పెట్టుకుని స్టైల్ గా ఫోటో దిగిన ఆ క్యూటీ నే మన ప్రియ ప్రకాష్ వారియర్. ప్రియా ప్రకాష్ వారియర్ ఓరు అదార్ లవ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా రిలీజ్ కాకముందే ఒకే ఒక్క సీన్ తో ఫేమస్ అయిపోయింది. కన్ను కొట్టి , రెండు కనుబొమ్మలను ఎగరేసి, రెండు చేతులు పైకి లేపి గన్ తో కాల్చినట్టు చేసే ఆ చిన్న సీన్ అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆమె ఎక్స్ ప్రెషన్ చూసిన కుర్రకారులు ఎవరు ఈ ముద్దుగుమ్మ అంటూ గూగుల్లో సెర్చింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది కానీ ఇంత హిట్ అందుకోలేకపోయింది. కానీ ప్రియ క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. తనకు ఉన్న క్రేజ్ తో తెలుగు లో 2 సినిమాలను అందుకుంది. ఆ సినిమాలు ఆమె అంతగా కలిసి రాలేదు. ఇప్పుడు హిందీలో 5 సినిమాలు కన్నడలో 1 , మలయాళంలో 2 సినిమాలు ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంది ప్రియా వారియర్. ఎంత బిజీగా ఉన్నా టైం దొరికినప్పుడు నెట్టింట సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.