Chinmayi: ఇటీవల నయనతార జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లయ్యాక నాలుగు నెలలకే నయన్ తల్లి కావడం షాకింగ్ పరిణామంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నయన్- విగ్నేష్ దంపతులు ఇంతలోనే పేరెంట్స్ కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. సరోగసీ ద్వారా నయన్ కవల పిల్లలకు తళ్లయిందని తెలుస్తుండటం వివాదానికి తెరలేపింది. వీరు ఇలా తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారో లేదో వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది.
జనవరి నెలలో భారతదేశం తీసుకువచ్చిన కొత్త సరోగసీ చట్టం ప్రకారం వీరిద్దరూ కనుక సరోగసి ద్వారా ఇప్పుడు పిల్లల్ని కంటే ఖచ్చితంగా అది ఇల్లీగల్ అవుతుంది. ఐదేళ్లదాకా శిక్ష పడే విధంగా కూడా చట్టంలో పేర్కొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలో ఏకంగా ఆరేళ్ల క్రితమే మ్యారేజ్ రిజిస్టర్ అయినట్లుగా ఉన్న ఒక డాక్యుమెంట్ కూడా వారు సబ్మిట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఏదైనా ఒక జంట సరోగసికి వెళ్ళాలి అంటే ఐదేళ్లపాటు పిల్లలు పుట్టక పోతే మాత్రమే సరోగసి అనే మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

Chinmayi : కౌంటర్ వేసిందిగా..
ఇక రీసెంట్గా సింగర్ చిన్మయి.. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమె తన ప్రెగ్నెన్సీ ఫొటోలు ఏవి షేర్ చేయకుండా డైరెక్ట్‌గా కవలలకు తల్లి అయినట్టు తెలియజేసింది.దీంతో ఆమెపై తెగ ట్రోల్ జరిగింది. అయితే తాజగా చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చింది సింగర్ చిన్మయి. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దిగిన సెల్ఫీ ని షేర్ చేస్తూ ” ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నేను తీసుకున్న ఫస్ట్ సెల్ఫీ ఇదే “అంటూ చెప్పుకొచ్చింది. మరో వీడియోలో నా పిల్లల ఫోటోలు షేర్ చేయదలచుకోవట్లేదు . నాకు నా కుటుంబం నా స్నేహితుల ప్రైవసి ఇంపార్టెంట్.. మా పిల్లల ఫొటోస్ ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయను అని స్పష్టం చేసింది. దీంతో ఈ పోస్ట్ పరోక్షంగా నయనతారపై సెటైరికల్‌గా ఉందని అర్దమవుతుంది.