Chiranjeevi : రామ్ చ‌ర‌ణ్ విష‌యంలో ఆ కోరిక చిరంజీవికి క‌ల‌గానే మిగిలిందా?

Advertisement

Chiranjeevi : చిరుత సినిమాతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చ‌ర‌ణ్‌. త‌న తండ్రి ఇమేజ్‌ని ఎక్క‌డా వాడ‌కుండా సొంత టాలెంట్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చ‌రణ్ ప‌ర్‌ఫార్మెన్స్ గురించి ఎంత మాట్లాడిన త‌క్కువే అని చెప్పాలి. అందులో న‌ట విశ్వ‌రూపం చూపించాడు. ఇక రంగ‌స్థ‌లం చిత్రంలోను త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు. మొత్తానికి రామ్ చరణ్ మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే.. చ‌ర‌ణ్ డాక్టర్ అవ్వల్సింది పోయి.. యాక్టర్ అయ్యాడట.

Advertisement

మెగాస్టార్ చిరంజీవ త‌న కొడుకు రామ్ చ‌ర‌ణ్‌ని డాక్ట‌ర్ గా చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. కాని కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆయ‌న యాక్ట‌ర్ అయిన‌ట్టు తెలుస్తోంది. చిరంజీవి అలా అనుకోవ‌డానికి కార‌ణం ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ వ‌స్తుందో రాదో చెప్ప‌లేం. శోభన్ బాబు లాంటిస్టార్స్ తమ వారసులను ఇటు వైపు చూడకుండా జాగ్రత్త పడ్డానికి కార‌ణం కూడా అదే. అందుకే రామ్ చ‌ర‌ణ్ సినీ ప‌రిశ్ర‌మ‌లోనిక అడుగుపెడితే స‌క్సెస్ రాక‌పోతే పరిస్థితి ఏంట‌ని ఆలోచించాడ‌ట‌. చరణ్ ను కూడా మూవీ వైపు రాకుండా ప్రయత్నం చేశాడట. అంతే కాదు ఈ ఇండస్ట్రీల్ పైకి ఎదుగుతుంటే వెనక నుంచి తొక్కేసే వాళ్ళ ఎక్కువగా ఉంటారు.. మనతో మంచిగా ఉంటూనే కెరీర్ ను నాశనంచేస్తుంటారు.

Advertisement
Chiranjeevi dream not fulfilled
Chiranjeevi dream not fulfilled

Chiranjeevi : చిరు కోరిక అలానే ఉందా..

అవ‌న్నీ ఆలోచించి చరణ్ ని డాక్టర్ చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. ఆ కోరిక మెగాస్టార్‌కి బ‌లంగా ఉండేద‌ట‌. డాక్టర్ గా ఆయన ఎన్నో ప్రాణాలు కాపాడుతుంటే చూసి సంతోషించాలి అనుకున్నారట. కాని చ‌ర‌ణ్ మొద‌టి నుండి యావరేజ్ స్టూడెంట్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సైన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదట . అందుకే చిరు కూడా రామ్ చరణ్ ను పెద్దగా ఇబ్బంది పెట్టకుండా.. తన కోరికను క్రమేపి చంపేసుకున్నాడట. సినిమాల్లోకి వస్తాను అని రామ్ చరణ్ స్వయంగా కోరడంతో చిరంజీవి కొడుకు కోరికను కాదనలేదక ఇండస్ట్రీలోకి ఎంకరేజ్ చేశారట. అలా చరణ్ విషయంలో మెగాస్టార్ కోరిక మాత్రం అలానే మిగిలిపోయిందని అంటుంటారు.

Advertisement