God Father 1st Day Collections : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 5 న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు గాడ్ ఫాదర్ సినిమాకు పాజిటివ్ టాకే వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం అంతంత మాత్రమే అన్నట్టుగా వచ్చాయి.
బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఓపెనింగ్స్ వచ్చాయని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. నైజాం ఏరియాలో 3.29 కోట్లు వచ్చాయి. సీడెడ్ ఏరియాలో 3.18 కోట్లు, యూఏలో 1.26 కోట్లు, ఈస్ట్ లో 1.60 కోట్లు(51 లక్షలు హైర్స్), వెస్ట్ 59 లక్షలు, గుంటూరు 1.75 కోట్లు(70 లక్షలు హైర్స్), కృష్ణ 73 కోట్లు, నెల్లూరు 57 లక్షలు(7 లక్షలు హైర్స్) ఉన్నాయి.

God Father 1st Day Collections : ఏపీ, తెలంగాణ మొత్తం 12.97 కోట్లు
ఏపీ తెలంగాణ మొత్తం చూస్తే 12.97 కోట్లుగా ఉంది. అంటే 21.40 కోట్లు గ్రాస్ గా ఉంది. 1.28 కోట్లు హైర్స్ వచ్చాయి. కర్ణాటకలో 1.56 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.05 కోట్లు, ఓవర్సీస్ లో 2.10 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 17.68 కోట్లు(32.70 కోట్ల గ్రాస్) గా తొలి రోజు గాడ్ ఫాదర్ వసూలు చేసింది. మూవీ మొత్తం బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్లుగా జరిగింది. బ్రేక్ ఈవెన్ 92 కోట్లుగా ఉంది. క్లీన్ హిట్ రావాలంటే సినిమాకు ఇంకా 74.32 కోట్లు కావాలి.