Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ వీకెండ్ లో అయితే గాడ్ ఫాదర్ సినిమా టికెట్లు కూడా దొరకడం లేదు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరోవైపు గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ ను కూడా మూవీ యూనిట్ నిర్వహించింది. సక్సెస్ మీట్ లో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి ఇన్ డైరెక్ట్ గా ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ ( koratala shiva )గురించి మాట్లాడారు.
చిరంజీవి ( chiranjeevi ) చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రసంగంలో కొరటాల శివకు ఇన్ డైరెక్ట్ గా చురకలు అంటించినట్టుగా ఉంది. సినిమా అంటే అందరి అభిప్రాయాలను తీసుకోవాలి. సమిష్టి కృషితో అనుభవం ఉన్నవాళ్ల సూచనలు పాటిస్తే.. అలా సినిమా తీస్తే ఏ సినిమా అయినా బాక్సాఫీసు వద్ద ఫలితం మంచిగా ఉంటుంది. అంతే కానీ.. మీ పని మీరు చూసుకోండి.. నేను చెప్పింది మాత్రమే చేయండి అని అంటే మాత్రం ఫలితం తారుమారు అవుతుంది.. అని కొరటాల శివను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడినట్టుగా ఉంది.

Chiranjeevi : ఆచార్య సినిమా డిజాస్టర్ ను చిరంజీవి ఇంకా తట్టుకోలేకపోతున్నారా?
మెగాస్టార్ చిరంజీవి తన నాలుగు దశాబ్దాల కెరీర్ లో నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఆయన అంతగా ఏ సినిమాకు బాధపడింది లేదు. కానీ.. ఆచార్య సినిమా డిజాస్టర్ అయినందుకు మాత్రం మెగాస్టార్ చాలా బాధపడినట్టు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ మూవీ హిట్ అయినా కూడా ఇంకా ఆ సినిమా గురించే ఆలోచిస్తూ ఆచార్య ప్రస్తావననే ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఎందుకు ఆచార్య సినిమాను అంత పర్సనల్ గా తీసుకున్నారో మెగా ఫ్యాన్స్ కు కూడా అర్థం కావడం లేదు.