Chiranjeevi : ఇటీవల సీనియర్ జర్నలిస్టు ప్రభు “శూన్యం నుంచి శిఖరాగ్రాలకు” అనే పుస్తకంలో రాశాడు. ఇక ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం రోజున జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ప్రభు రాసిన పుస్తకం చాలా బాగుందని ఇలాంటివారు మన తెలుగు పరిశ్రమలో ఉండటం మన తెలుగువారికి గర్వకారణం అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పుస్తకం మందు తారాల వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. అలాగే జర్నలిస్టుల గురించి కూడా ప్రశంసిస్తూ మాట్లాడారు చిరంజీవి. ఇలా మాట్లాడుతూ రామ్ చరణ్ చిరంజీవి ల గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాడు చిరంజీవి.
ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ తరంలో మెగాస్టార్ హీరోల ప్రస్తావన వస్తే రామ్ చరణ్ , బన్నీ , వైష్ణవి తేజ్ ,సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ మాత్రమే గుర్తు వస్తున్నారని, వీళ్ళ వలన నా మనవళ్ళు , మనవరాల ముందు నా గురించి నేనే చెప్పుకోవాల్సి వస్తుందంటూ సరదాగా వ్యాఖ్యానించారు మెగాస్టార్. నా మనవళ్లు మనవరాలు ఈతరం హీరో సినిమాలను చూస్తున్నారు. ఇక వారి సినిమా పాటలకే డాన్సులు వేస్తున్నారు, అరే నా సినిమా లో ఎన్ని మంచి పాటలు ఉన్నాయి వాటిని అడగరేంటని ఫీల్ అయ్యే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఈ తరహాలో నా ఇంట్లోనే నాకు శత్రువులు తయారయ్యారంటూ సరదాగా వ్యాఖ్యనించారు మెగాస్టార్.

ఇక కరోనా నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండడంతో నా మనవళ్ళు మనవరాలకు నా గురించి నేను చెప్పుకోవడం మొదలు పెట్టాను . వారికి నా సినిమాలను కూడా చూపించాను, అవి చూసినవారు భయ్యా మీరా ఇంత బాగా డాన్స్ వేసేది అన్నారంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. అయితే చిరంజీవిని ఆయన మనవళ్లు మనవరాలు తాతా అని పిలవరట భయ్యా అని పిలుస్తారట. నా ముందు మీ బాబాయి మీ మామలు బచ్చాగాళ్ళు రా అని నా సెల్ఫ్ డబ్బా నేనే కొట్టుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి.పిల్లలు ముందు నా సెల్ఫ్ డబ్బా నేనే కొట్టుకోవాల్సి వచ్చింది అలాంటి పరిస్థితుల లో ఉన్నాం మనం. ఇది ఇలాగే కొనసాగితే మా తరం ప్రముఖ దిగ్గజాలను అందరు మర్చిపోతారని, అలా జరగకుండా భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ఈ బుక్ ను రాసినందుకు ప్రభు గారికి ధన్యవాదాలుు అంటూ ప్రశంసించాడు చిరంజీవి.