Chiranjeevi 154 movie : చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో తేరకేక్కబోతున్న సినిమా “వాల్తేర్ వీరయ్య”. ఇది మెగాస్టార్ యొక్క 154 వ సినిమా. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు దర్శక బృందం. ఇక ఈ సినిమా టైటిల్ బట్టి చూస్తే మాస్ కాన్సెప్ట్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాను తీస్తున్నాను అని దర్శకుడు బాబి చెప్పుకొచ్చారు.తన అభిమానం మొత్తం ను ఈ సినిమాలో చూపిస్తానని డైరెక్టర్ చెబుతున్నారు. ఇక దీనిలో చిరంజీవి సోదరుడిగా రవితేజ నటించనుండగా, ఇంకా కొన్ని బలమైన పాత్రల కోసం చిత్ర బృందం వెతుకుతుందని సమాచారం.
అయితే రవితేజ మరియు చిరంజీవి పాత్రల మధ్య , బలమైన ఎమోషనల్ సీన్స్ ఉంటాయని తెలుస్తున్నాయి. రవితేజ తెరపై కనిపించేది కొద్దిసేపు అయినా అతను కనిపించే సీన్స్ మాత్రం సూపర్ గా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరియు కింగ్ నాగార్జున కూడా భాగస్వాములు అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ సినిమాను మల్టీ స్టారర్ సినిమాగా పెద్ద ఎత్తున రూపొందించడం జరుగుతుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా దాదాపు పూర్తవడానికి వచ్చింది.

కానీ రెండు నెలలుగా షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. ఇప్పటికిప్పుడు ఈ సినిమాను హడావిడిగా పూర్తి చేయడం కంటే టైం తీసుకోవడం మంచిదని సినిమా బృందం అనుకున్నారట. దీంతో ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే బోలా శంకర్ సినిమా షూటింగ్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక నెక్స్ట్ రాబోయే వాల్తేరు వీరయ్య పై భారీ అంచనాలను పెట్టుకుంటున్నారు చిరంజీవి అభిమానులు.