Conductor Jhansi : కండ‌క్ట‌ర్ ఝాన్సీకి ఫిదా అయిన హీరో.. త‌న సినిమాలో అవ‌కాశం ఇచ్చాడా..!

Advertisement

Conductor Jhansi : చాలా మందిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది కొన్ని సంద‌ర్భాల ద్వారానే బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ద్వారా చాలా మందికి తొంద‌ర‌గా పాపులారిటీ ల‌భిస్తుంది. ఇటీవ‌ల శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన పల్సర్ బండి పాట స్టెప్పులతో ఒక్క‌సారిగా హైలైట్ అయింది కండ‌క్ట‌ర్ ఝాన్సీ. గతంలో రికార్డింగ్ ట్రూప్ లో ఆమె వేసిన పాటలకు సంబంధించిన స్టెప్పులు సోషల్ మీడియాను కుదిపేయ‌డంతో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమెతో స్టెప్పులేయించారు. ఆమె డ్యాన్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. అంతే కాదు ప‌లు మీడియా ఛానెల్స్ ఆమెతో తెగ ఇంట‌ర్వ్యూలు కూడా తీసుకుంటున్నాయి.

Advertisement

గాజువాక ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్ గా చేస్తున్న ఝాన్సీ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఈ టాలెంటెడ్ కండక్టర్ కు ఓ హీరో సినిమా ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు సంపూర్ణే ష్ బాబు. తాను చేయబోయే సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. సంపూర్ణేష్ బాబు నటిస్తున్న నెక్ట్స్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో జాన్సీకి ఛాన్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. స్వయంగా సంపూర్ణేష్ బాబు ఝాన్సీకి ఫోన్ చేయడంతో ఆమె తెగ ఆనందపడిపోతుంది. సినిమా ఆఫర్ రావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ పాట షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

Advertisement
conductor jhansi gets crazy offer
conductor jhansi gets crazy offer

Conductor Jhansi : మంచి ఛాన్స్..

సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండ‌గా, కొన్ని సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్ అవుతున్నాయి. కండ‌క్ట‌ర్‌గా ప‌ని చేసిన ఝాన్సీ.. ఇప్పుడు బాగానే సంపాదిస్తున్న‌ట్టు తెలుస్తుది. ఆమె పారితోషికం ఏ షోకి అయిన వెళ్లాలంటే 50 వేల రూపాయ‌లుగా ఉన్న‌ట్టుగా తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా.. ఏదైనా డాన్స్ కార్యక్రమానికి వెళ్లాలన్నా.. ఎక్కడైనా ఆమె కనిపించాలన్నా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి తన ఉద్యోగానికి కూడా దూరంగా ఉంటుందట. లాంగ్ లీవ్ పెట్టిన కండక్టర్ ఝాన్సీ పూర్తిగా డాన్స్ పై దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. వ‌రుస ఆఫ‌ర్స్ వ‌చ్చిప‌డుతున్న నేప‌థ్యంలో ఝాన్సీ రెమ్యున‌రేష‌న్ పెంచింద‌ని టాక్.

Advertisement