Prabhas Salaar : సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్ సిరీస్ ఎంత ప్రభావం చూపించిందో అందరికీ తెలుసు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందని అందరూ తెగ ఎదురు చూశారు. కానీ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తన తదుపరి మూవీని ప్లాన్ చేశాడు. అది కూడా కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగానే వస్తోంది. కేజీఎఫ్ 3 నే సలార్ సినిమాగా ప్రభాస్ తో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. మరి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కే సలార్ ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో అని ప్రభాస్ అభిమానులు ఆ సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ మోస్ట్ వైలెంట్ మ్యాన్ అన్నట్టుగా ఫస్ట్ లుక్ లో చూపించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా జగపతిబాబు నటిస్తున్నాడు. అయితే.. ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నాడట. ఇప్పటికే పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ ను కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. వరదరాజు మన్నార్ గా పృథ్వీరాజ్ కనిపించనున్నారు. ఆయన మలయాళంలో సూపర్ స్టార్. అంతటి స్టార్ హీరో సలార్ మూవీ యూనిట్ తో జతకట్టడంతో ఇక సలార్ సినిమాకు తిరుగులేదంటూ ప్రభాస్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

Prabhas Salaar : డార్లింగ్ ఇమేజ్ ను ఈ సినిమా మ్యాచ్ చేస్తుందా?
నిజానికి.. బాహుబలి సిరీస్ తర్వాత అంతగా యాక్షన్ మాస్ సినిమాల్లో ప్రభాస్ నటించలేదు. బాహుబలి తర్వాత అంతటి స్కోప్ ఉన్న సినిమా సలార్ మాత్రమే. అందుకే ప్రభాస్ తో పాటు యావత్ సినీ అభిమానులు ఈ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే సాహో, రాధే శ్యామ్ నిరాశపరిచాయి. ఆదిపురుష్ సినిమాపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇక మిగిలినవి సలార్, ప్రాజెక్ట్ కే. ప్రభాస్ క్యారెక్టర్ కు పర్ ఫెక్ట్ గా సరిపోయే సినిమా అంటే ప్రస్తుతం సలార్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.