Deepthi Sunaina : బిగ్ బాస్ షోతో చాలా క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ దీప్తి సునయన. షణ్ముఖ్‌తో బ్రేకప్ విషయంలో ఈ అమ్మడికి చాలా పాపులారిటీ దక్కింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తుంటుంది. తన మీద వచ్చే నెగెటివ్ కామెంట్లు, ట్రోలింగ్‌లను దీప్తి సునయన తిప్పి కొడుతూ ఉంటుంది. దీప్తి సునయన ట్రోలర్లకు ఇచ్చే ఆన్సర్లు కూడా ఘాటుగానే ఉంటాయి. నవ్వుతూనే స్వీట్ వార్నింగ్ ఇస్తుంటుంది. ఇక రూమర్లపై అయితే సెటైర్లు వేస్తుంటుంది. దీప్తి సునయన చేతిలో ప్రస్తుతం అవకాశాలు లేకుండా పోయాయి. బుల్లితెరపై ఎక్కడా కనిపించడం లేదు. ఇక వెండితెరపై మాత్రం అస్సలే అవకాశాలు రావడం లేదు.
అప్పుడప్పుడు యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్, స్పెషల్ ప్రైవేట్ ఆల్బమ్‌లతో కనిపిస్తుంటుంది. ఇటీవల ఈ అమ్మడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ కొన్ని ప్రచారాలు నడిచాయి. వాటిని దీప్తి కొట్టి పారేసింది. నాకు తెలీదే ఇది అంటూ కౌంటర్ వేసింది. మొత్తానికి దీప్తి సునయన మాత్రం ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌కు దూరంగానే ఉన్నట్టుంది. యూట్యూబర్ గా మంచి పేరు సంపాదించుకున్న దీప్తి సునయన బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Deepthi Sunaina : అందంతో చంపేస్తుందిగా..
హౌస్ లో ఉన్నంత కాలం బాగా అల్లరి చేస్తూ, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. మొదట డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 5లో సిరితో షణ్ముక్ చేసిన హగ్గులు, కిస్సులు వల్ల దీప్తి సునయన బాగా డిస్ట్రబ్ అయ్యింది. అయితే కూడా హౌస్‌లో ఉనన్ని రోజులు తనకు సపోర్ట్‌గానే నిలిచింది. తనకు బయట నుంచి మంచి ఓటింగ్ పడేలా తన వంతు కృషి చేసింది. అయితే షన్ను, సిరిల ఓవర్ యాక్షన్స్ ఆడియెన్స్‌కు నచ్చకపోవడంతో హౌస్ నుంచి బయటకు రాగానే దీప్తి సునయన..షణ్ముక్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేసింది. తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది.