Devi Sri Prasad : రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో సంగీత ప్రియులని ఎంతగానో అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవీ శ్రీ ప్రసాద్ తన బీట్తో పూనకాలు తెప్పిస్తాడు. దేవి శ్రీ మ్యూజిక్ మ్యూజిక్ వచ్చిందంటే ఫ్యాన్స్‌కు పండగే. ఇక ఇప్పటివరకు దేవీ శ్రీ పలువురు స్టార్ హీరోలుకు హిట్ మ్యూజిక్ అందించాడు. ఒకప్పుడు దేవిశ్రీ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. కొరటాల శివ, త్రివిక్రమ్ తో పాటు పలువురు దర్శకులు దేవిశ్రీ ట్యూన్స్ కోరుకునేవారు.ఇటీవల దేవి శ్రీ హవా తగ్గింది. ఆయన సినిమాలు తగ్గాయి. చాలా మంది హీరోలు థమన్ సంగీతంపై ఆసక్తి చూపుతుండగా, దేవి శ్రీకి అవకాశాలు తక్కువయ్యాయి.
ఈయన కలర్ స్వాతిని మెసేజ్‌లతో వేధించాడట. ఈ విషయం ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది. కలర్ స్వాతి అంటే ప్రతి ఒక్కరు ఇట్టు గుర్తు పట్టేస్తారు. తన పదహారేళ్ల వయసులో కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకరింగ్ చేసి జనాలకు దగ్గరైన స్వాతి ..కలర్స్ ప్రోగ్రాంలో ఆమె యాక్టింగ్.. ఆమె స్పాంటేనియస్ డైలాగ్స్.. ఆమె చిరునవ్వుతో చాలా ఆఫర్స్ అందుకుంది. సినిమా హీరోయిన్గా కూడా అలరించింది. హిట్లు ఫ్లాపులు అని సంబంధం లేకుండా జనాల ను తన నటన తో మెప్పించింది. స్వాతి కేవలం నటే కాదు మంచి సింగర్ . పాటలు బాగా పాడుతుంది . అయితే సినిమాలో పాటలు పాడడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు.

Devi Sri Prasad : ఏం చేశాడంటే..
స్వాతిలోని టాలెంట్ ని గుర్తించిన దేవి శ్రీ ప్రసాద్… సినిమాలోని పాట పాడడానికి ఆఫర్ చేశాడట. ఆమెకు పదేపదే ఫోన్ చేస్తూ మెసేజ్ చేస్తూ విసిగించేసిన కూడా స్వాతి నో చెప్పేసిందట. . ఏకంగా ఇంటికి వెళ్లి పేరెంట్స్ కి చెప్పి ఫోర్స్ చేశారట. దీంతో ఆ బాధను భరించలేక కలర్స్ స్వాతి.. డిఎస్పీ కోసం పాట పాడింది. అది ఏ పాట ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 100% లవ్ సినిమాలో …ఏ స్క్వేర్ బి స్క్వేర్ ..అనే పాట ఫిమేల్ వర్షన్ పాడింది కలర్ స్వాతి. ఈ సినిమాలో ఈ పాట హైలైట్ గా నిలిచింది . ఆ తర్వాత స్వాతి పెద్దగా పాడింది లేదు. పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో బిజీగా ఉన్న స్వాతి ఇటీవల సినిమాలతో సందడి చేసేందుకు సిద్దమైంది.