Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ ఈ పేరు తెలియని తెలుగు వారు ఎవరు ఉండరు. ఎన్నో సినిమాలో సంగీత దర్శకుడుగా చేసి ఫేమస్ అయ్యాడు. ఇక తను సంగీతం అందించిన చాలా పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అయితే తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తన మొదటి ఆల్బమ్ సాంగ్ “ఓ పరి” ను విడుదల చేశారు. ఇక ఈ పాటకు మంచి స్పందన లభించింది. హిందీ వర్షన్ లో రిలీజ్ అయిన ఈ సాంగ్ 20 ప్లస్ మిలియన్ వ్యూస్ ను సాధించింది. అయితే సినీ ఇండస్ట్రీలో పలు సన్నివేశాలు,పాటలు వివాదాస్పదంగా మారతాయి. చిన్న చిన్న ప్రైవేట్ సాంగ్స్ నుంచి భారీ బడ్జెట్లో సినిమాల వరకు ఇలాంటి వివాదాలు ఎదురవుతూనే ఉంటాయి.
అయితే ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ తన మొదటి సాంగ్ అయినా ఓ పరి పై ఇలాంటి ఒక వివాదాస్పర సంఘటన జరిగింది. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసే కరాటేే కళ్యాణి దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసిన పాటలో ని సాహిత్యం హిందూ మతాన్ని , హిందువులను అవమానించేలా ఉన్నాయంటూ విమర్శిస్తుంది. అంతేకాదు హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పరాటే కళ్యాణి ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. దేవిశ్రీప్రసాద్ ఇటీవల విడుదల చేసిన సాంగ్ లో హిందూ మత పవిత్ర శ్లోకమైన హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఉపయోగించారని, ఇది తోటి హిందూ సంస్థలను కించపరిచేలా ఉన్నందున తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది.

కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజుల్లో హిందువులు చాలా అవమానాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. హిందూ దేవుళ్ళ గొప్పతనం గురించి మాట్లాడేందుకు మేము హరే రామ హరే కృష్ణ అని జపిస్తామని, ఈ మంత్రాన్ని దేవిశ్రీప్రసాద్ తనపాటలో వాడడం చూసి నేను షాక్ అయ్యానని తెలిపింది. దేవిశ్రీప్రసాద్ ఒక హిందూ అయి ఉండి కూడా హిందూ మతాన్ని గౌరవించటం లేదని, పవిత్రమైన శ్లోకం పాడుతూ బికినీలు వేసుకున్న అమ్మాయిలతో డాన్స్ చేశాడని, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినంత మాత్రాన హిందువులను అవమానిస్తే ఊరుకునేది లేదని కళ్యాణి పేర్కొంది. ఇక హిందువుల పవిత్ర మంత్రాలని కించపరచినందున దేవిశ్రీప్రసాద్ హిందువులందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కళ్యాణి కోరింది.