Samantha – Naga Chaitanya : కోలీవుడ్ లో చూడముచ్చటైన జంటగా అందరి ప్రశంసలు అందుకున్నారు ధనుష్- ఐశ్వర్య. కొద్ది రోజుల క్రితం ఈ జంట విడిపోతున్నట్టు ప్రకటించగా, 2022 ప్రారంభంలోనే ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందేంటి అని అంతా నెత్తికొట్టుకున్నారు. నిజానికి ధనుష్-ఐశ్వర్య ల మధ్య గొడవలు 2009లోనే మొదలయ్యాయట.అవి ముదరడంతో 2013లోనే వీరు విడిపోతున్నారు అని వార్తలు వచ్చాయి. ఓ స్టార్ హీరోయిన్ తో ధనుష్… సెపరేట్ గా గడుపుతుండడం.. ఈ విషయం ఐశ్వర్యకి తెలిసి పెద్ద గొడవ చేయడం వంటివి జరిగాయట.
అయితే రజినీ కాంత్ సీన్లోకి ఎంటర్ అయ్యి ఈ విషయాలను అల్లరి చేయకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. రజనీకాంత్ ఒత్తిడి మేరకు మాత్రమే ధనుష్- ఐశ్వర్యలు కొన్నిరోజులు కలిసున్నారని తెలుస్తుంది. పరిస్థితి రజినీ చెయ్యి దాటడంతో వారు విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ జంట తిరిగి కలవబోతున్నట్టు సమాచారం. రీసెంట్ గా కౌన్సిలింగ్ తీసుకున్న ఈ జంట పిల్లల భవిష్యత్తు కోసం తమ విడాకులు తీసుకోవాలని అనుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్న తెలుస్తుంది. ఇదే విషయాన్ని మరికొద్ది రోజుల్లో ఈ జంట ఓ భారీ ఈవెంట్లో చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.

Samantha – Naga Chaitanya : గుడ్ న్యూస్..
కాగా ఇదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య కూడా కలిస్తే బాగుండు అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. నాగ చైతన్య – సమంత ల విడాకుల మేటర్ ను డైజెస్ట్ చేసుకోవడానికి జనాలకి చాలా టైం పట్టింది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఆ విషయం పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. మన తెలుగు మీడియాకి సమంత ఈ విషయం పై పెద్దగా స్పందించలేదు కానీ… బాలీవుడ్ మీడియాకి చాలా రీజన్స్ చెప్పింది. వారిద్దరిని కలపడానికి చాలా మంది పెద్దలు సీన్ లోకి దిగారట. కాని ఎవరి మాట వినని వారు విడిపోయి సపరేట్గా ఉంటున్నారు.