MS Dhoni : ఇన్నాళ్లు మహేంద్ర సింగ్ ధోని గ్రౌండ్లో అదరగొట్టగా, ఇప్పుడు సినిమాలతో సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం నిర్మాతగా ప్రయత్నం చేస్తున్నాడు. అన్నీ కలిసి వస్తే త్వరలో హీరోగా కూడా ఆయనని చూసే అవకాశం లేకపోలేదు. 2020, ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ..ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు. ఈయన సినిమాలో హీరో హీరోయిన్లు కూడా ఫిక్స్ చేశారని సమాచారం. కాగా, రీసెంట్గా ధోనీ ఎంటర్ టైన్మెంట్ అంటూ తన బ్యానర్ ను ప్రకటించారు. తన తొలి ప్రొడక్షన్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు రమేష్ తమిళమణి ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు.
ఎంఎస్ ధోనీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మించబోతోన్నట్లు తెలిపారు. ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌కు ధోనీ భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు. రమేష్ తమిళమణి రాసిన అథర్వ – ది ఆరిజిన్ అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా ఎంఎస్ ధోనీ- తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కింద మొట్టమొదటి సినిమాను తెరకెక్కించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని రమేష్ తమిళమణి చెప్పారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ లు హీరో హీరోయిన్ లుగా నటించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన టీమ్ నుండి రావాల్సి ఉంది. తమిళనాడులో ధోనీకి వీరాభిమానులు ఎక్కువే. సుదీర్ఘకాలంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఐపీఎల్లో ఆడుతున్న ధోనీని అక్కడ ‘తలైవా’ అంటూ తమిళులు ఉన్న సంగతి తెలిసిందే,

MS Dhoni : ఇక వరుస సినిమాలు..
కాగా- తమిళంలో తన తొలి సినిమాను తెరకెక్కించిన తరువాత- తెలుగు, మలయాళంలో వరుసగా ఎంఎస్ ధోనీ సినిమాలను పట్టాలెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఉండొచ్చని చెబుతున్నారు. దీనికోసం ఇప్పటికే మహేష్ బాబును సంప్రదించారని సమాచారం. సాక్షి సింగ్ ధోనీ రాసిన ఓ కాన్సెప్ట్ ఆధారంగా ధోనీ తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని సమాచారం. ఈ కాన్సెప్ట్‌ను మరింత డెవలప్ చేసే పనిలో ఆయన టీమ్ ఉందని అంటున్నారు.