Pawan Kalyan : పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిన ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయ్యిందా?

Advertisement

Pawan Kalyan : పూనమ్ కౌర్ అని పేరు చెప్పగానే మనకు టక్కున గుర్తొచ్చే మరో పేరు పవన్ కళ్యాణ్. ఎందుకంటే పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది. తనపై చాలా ఆరోపణలు చేసింది. దీంతో తన గురించి అందరికీ తెలిసింది. తను లైమ్ లైట్ లోకి వచ్చింది. నిజానికి పూనమ్ కౌర్.. తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించినా రాని క్రేజ్.. పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేయగానే వచ్చేసింది. మాయాజాలం సినిమాతో పూనమ్ కౌర్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తను సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలోనూ తను చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Advertisement

తాజాగా తను షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొన్న అందరూ కర్వాచౌత్ పండుగను జరుపుకున్న విషయం తెలిసిందే కదా. కర్వాచౌత్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పూనమ్ కౌర్ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆమె చేతిలో జల్లెడ పట్టుకొని చంద్రుడివైపు చూస్తూ నవ్వు నవ్వింది. ఆ ఫోటోనే తన సోషల్ మీడియాలో షేర్ చేసింది పూనమ్.

Advertisement
did poonam kaur marriage fix
did poonam kaur marriage fix

Pawan Kalyan : పూనమ్ కు పెళ్లి కుదిరిందా? లేక పెళ్లి అయిందా?

కర్వాచౌత్ ను కేవలం పెళ్లి అయిన మహిళలే చేస్తారు. పెళ్లి అయిన మహిళలు తమ భర్త క్షేమంగా ఉండాలని పార్వతీదేవిని పూజిస్తారు. రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రి కాగానే చంద్రుడిని చూసి తమ ఉపవాస దీక్షను విరమిస్తారు. అయితే.. జల్లెడలో చంద్రుడిని చూసిన తర్వాత తమ భర్త ముఖం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ పెళ్లయిన వాళ్లు కాకపోతే పెళ్లి ఫిక్స్ అయిన వాళ్లు అయినా కర్వాచౌత్ ను నిర్వహించుకోవచ్చు. మరి.. పెళ్లి కాకుంటే.. పెళ్లి ఫిక్స్ కాకుంటే పూనమ్ కౌర్ ఎందుకు కర్వా చౌత్ నిర్వహిస్తోంది అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. అంటే.. తనకు పెళ్లి అయి అయినా ఉండాలి లేదంటే.. పెళ్లి ఫిక్స్ అయినా అయి ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేతుల్లో ఏ సినిమా లేదు. చాలా రోజుల తర్వాత నాతి చరామి అనే సినిమాలో నటించింది కానీ.. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఇక సినిమాల జోలికి అప్పటి నుంచి వెళ్లడం లేదు ఈ సుందరి.

Advertisement