Naga Chaitanya: సమంత నుండి విడిపోయిన తర్వాత నాగ చైతన్యకి అస్సలు కలిసి రావడం లేదు. ఆయన ఏ సినిమా చేసిన కూడా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉంది. ఇటీవల విడుదలైన ‘థాంక్యూ’ అనే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ కూడా నాగ చైతన్య పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు..లాల్ సింగ్ చద్దా చిత్రం కూడా నాగ చైతన్యకు కలిసి రాలేదు. ప్రస్తుతం తమిళ టాప్ డైరెక్టర్ విక్రమ్ ప్రభు తో ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ శెరవేగంగా సాగుతుంది..విక్రమ్ ప్రభు సినిమాలు అంటే టాలీవుడ్ కూడా మంచి క్రేజ్ ఉంది..
తమిళ టాప్ హీరో శింబు తో తెరకెక్కించిన మనాడు చిత్రం కొద్దీ నెలల క్రితమే విడుదలై కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది..ఇప్పుడు ఆ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా చేస్తుండడం తో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని మేల్కొటి గ్రామం లో ప్రత్యేకమైన అనుమతి ని తీసుకొని ఆ చిత్ర బృందం షూటింగ్ చేస్తుంది..సినిమాలో కీలకమైన ఒక సన్నివేశం కోసం ఒక వైన్ షాప్ సెట్ ని వేశారు..ఆ వైన్ షాప్ సెట్ ప్రాంగణం లోనే ఆ రాయగోపారా దేవాలయం ఉన్నది..దీంతో వివాదం నెలకొంది.

Naga Chaitanya : ఎందుకిలా…
పవిత్రమైన ఆలయం ఉన్న చోట హిందూ ధర్మాన్ని అవహేళన చేసే విధంగా ఇలా వైన్ షాప్ సెట్ వేస్తారా.అంటూ గొడవలకి దిగారు. ఇప్పుడు షూటింగ్ ఆపితే కోట్ల నష్టం వస్తుంది మేము ఆపము అంటూ మొండికేశారట..అప్పుడు గ్రామ ప్రజలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి, అనుమతిని రద్దు చేసి షూటింగ్ ఆపేయాలి అంటూ ఆదేశించారట.. తప్పని పరిస్థితిలో షూటింగ్ ఆపాల్సి వచ్చిందట. చూస్తుంటే సమంత శాపం చైతూకి తగిలిందా. ఎందుకు ఇటీవల ఆయనకు ఏ పని కూడా కలిసి రావడం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.