Arundhati Movie Child Artist : అరుంధతి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని చెప్పవచ్చు. 2009లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్స్ వర్షం కురిపించిందని చెప్పాలి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అనుష్క నటించి ఆ పాత్రకు ప్రాణం పోసింది. ఇప్పటికీ కూడా అరుంధతి అంటే మొదటిగా గుర్తొచ్చే పేరు అనుష్కనే. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది అనుష్క. ఇక ఈ సినిమాతో అనుష్క క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది.
అలాగే ఈ సినిమా లో నటించిన నటీ నటులకు కూడా మంచి పేరు వచ్చింది. విలన్ క్యారెక్టర్ లో సోనూ సూద్ చేసిన పాత్ర మరో లెవల్లో ఉంటుంది. దీంతో సోనూ సూద్ తెలుగులో కూడా ఫేమస్ అయిపోయారు.అలాగే ఇదే సినిమాలో అరుంధతి చిన్ననాటి పాత్రను దివ్య నగేష్ చేసింది. ఈ పాత్రలో దివ్య కనిపించింది కొద్దిసేపే అయినా ,తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈమెకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. అరుంధతి తర్వాత అల్లు అర్జున్ వరుడు సినిమాలో అవకాశం దక్కించుకుంది దివ్య. ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే హీరోయిన్ గా మారిపోయింది. 2011లో తమిళ్ సినిమా అయినా “ప్రసకార నన్ బర్ గల్” అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది.

ఆ తర్వాత తెలుగులో “నేను నాన్న అబద్ధం ” అనే సినిమాతో ముందుకు వచ్చింది. ఆ తర్వాత నుండి ఏమికు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఇక దివ్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే. ఈమె సంప్రదాయ మలయాళ కుటుంబం నుంచి వచ్చింది. 1988 ఏప్రిల్ 13న కేరళలోని అలవల జిల్లాలో జన్మించారు దివ్య. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఇప్పుడు తమిళ్ సినిమాలలో చేస్తుంది. దివ్య కు తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు తమిళ్ మరియు మలయాళ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటుంది. దివ్య నాగేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.