Amitabh Bachchan : బాలీవుడ్ షాహెన్షా అంటే ఎవరో తెలుసా? మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అవును.. ఆయనను బిగ్ బీ అని కూడా సంభోదిస్తారు. ఆయన వయసు ఇప్పుడు 80 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా, యాక్టివ్ గా కనిపిస్తారు. బాలీవుడ్ పేరు ఎత్తితే చాలు.. చాలామంది అమితాబ్ బచ్చన్ గురించే చెబుతారు. అసలు.. బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు, ఇతర నటులు మొత్తం.. అమితాబ్ ను ఆదర్శంగా తీసుకున్నవాళ్లే. ఆయన ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా మీద తనకు ఉన్న పాషన్ ను అందరికీ తెలిసేలా చేస్తున్నారు.
ఆయన ఈ వయసులోనూ ఉరకలేస్తూ ఉత్సాహంగా సినిమాల్లో నటిస్తున్నారంటే ఆయన ఎంత యాక్టివ్ గా ఉన్నారో అర్థం అవుతుంది. మీకో విషయం తెలుసా? ప్రతి సండే తన అభిమానులు ఆయన ఇంటి ముందు గుమిగూడుతారు. ఆయన ఇంటి ముందు ఆయన కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తారు. ఎందుకంటే.. తమ అభిమాన నటుడితో ఫోటోలు దిగేందుకు వాళ్లు అక్కడ వెయిట్ చేస్తుంటారు. ఆయన ఇంటి ముందు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ రూ.500 జీతానికి కూడా పనిచేశారు.ఒకప్పుడు రూ.500 నెల జీతానికి పని చేసిన బిగ్ బీ.. నేడు ఒక్క సినిమా చేస్తే కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.

Amitabh Bachchan : ముంబైలోనే ఐదు బంగ్లాలు ఉన్నాయి
కానీ.. ఇదంతా ఆయనకు అంత ఈజీగా రాలేదు. చాలా కష్టాలు పడ్డారు. చివరకు తనేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన వేలకోట్ల ఆస్తికి యజమాని. ముంబైలోనే అమితాబ్ బచ్చన్ కు ఐదు బంగ్లాలు ఉన్నాయి. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉంటున్నారు. అక్కడ ఉన్న జల్సా అనే బంగ్లాలో ఆయన తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. ఆ బంగ్లా ఖరీదు ఎంతో తెలుసా? వందకోట్లకు పైనే ఉంటుంది. ఆయనకు లగ్జరీ వాహనాలు ఉన్నాయి. యూపీలో ఆస్తులు ఉన్నాయి. ఫ్రాన్స్ లోనూ పలు ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ నికర ఆస్తుల విలువ 410 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.3000 కోట్లకు పైనే.