Hyper Aadi : హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన డబుల్ మీనింగ్ పంచులతో వల్గర్ డైలాగులతో , తన స్క్రిట్లతో నిత్యం సోషల్ మీడియా లో ఎప్పుడూ ట్రెండింగ్ అవుతూనే ఉంటాడు. హైపర్ ఆది అనే పేరు ఒకప్పుడు అసలు ఎవరికీ తెలియదు. జబర్దస్త్ వేదికగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ స్కిట్ లలో ఎక్కువ వీవ్స్ వచ్చిన స్కిట్ ఏదైనా ఉంది అంటే అది హైపర్ ఆది స్కిట్. హైపర్ ఆది చేసిన ఒక స్కిట్ ని దాదాపుగా కోటి మందికి పైగా వీక్షించారు. దీని గురించి హైపర్ ఆది కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
జబర్దస్త్ లో తన సూపర్ స్కిట్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. మొదట్లో హైపర్ ఆది స్కిట్లు నవ్వించే విధంగా ఉండేవి. ఇక ఇప్పుడు వల్గర్ డైలాగ్స్ తో చేలరేగిపోతున్నాడు . అయితే వెండితెర ,బుల్లితెరలో ఎవరైనా తాము ఫామ్ లో ఉన్నప్పుడే ఆస్తులు సంపాదించుకుని వెనకేసుకుంటున్నారు. వాళ్లు పాపులారిటీ ఉన్నప్పుడే రెమినేషన్ ఎక్కువగా తీసుకుంటూ ఆస్తులను వెనకేసుకుంటున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు హైపర్ ఆది కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హైపర్ ఆది ఎంత ఆస్తిని సంపాదించుకున్నాడు అనే వార్తలు ,

వైరల్ అవుతున్నాయి.అయితే ఇండస్ట్రీకి రాకముందు హైపర్ ఆదికు కేవలం ఒక చిన్న సొంత ఇల్లు మాత్రమే ఉందట. కానీ ఇప్పుడు హైపర్ ఆదికు దాదాపుగా 50 కోట్లకు పైనే ఆస్తులు ఉన్నాయని అందరూ అంటున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యన హైదరాబాద్ లో హైపర్ ఆది తీసుకున్న ఇల్లు ఖరీదు దాదాపుగా 10 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ఇదే కాకుండా ఒక్కో ఎపిసోడ్ కి హైపర్ ఆది దాదాపుగా 70 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న ఏకైక జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మాత్రమే. హైపర్ ఆది అతి చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి చేరుకున్నాడు అంటే దానికి కారణం అతను కష్టం మరియు టాలెంట్ అని చెప్పాలి.