Pragathi : ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైనా శైలిలో నటిస్తూ సిని పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రతేక స్థానాన్ని ఏర్పరచుకుంది. అమ్మ ,ఆంటీ లాంటి పాత్రలు చేస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే సిని జీవితంలో ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి వాటిని తట్టుకుని నిలబడిన వారికి జీవితం మరిన్ని అవకాశాలను ఇస్తుంది.విమర్శలను పునాదులుగా మార్చుకున్న వారే జీవితంలో పైకి వస్తారు. కరోనా సమయంలో చాలా మంది చాలా విషయాలు నేర్చుకున్నారు.
ఈ నేపథ్యం లో ప్రగతి కూడా ఏదైనా కొత్తగా చేయాలి అన్న ఆలోచనతో యూ ట్యూబ్ ను ప్రారంభించింది. అందులో తన రోజువారి కార్యక్రమాలను పోస్ట్ చేస్తుంది. సామాజిక మాద్యమాల్లోకి రావడానికి చాలా ధైర్యం కావాలి.ఎందుకంటే ఇందులో ప్రశంసలకంటే విమర్శలు ఎక్కువ. ప్రశంసలతో పాటు విమర్శలను కూడా స్వీకరించాలి. ఇంట్లో ఉంటే ఎవరు మన గురించి మాట్లాడరు కాని బయటకి వస్తే చాలా ఎదురుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్నది సాధించగలం. నేడు ప్రగతి కూడా ఇదే చేస్తుంది.ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంది.

ప్రగతి జిమ్ లో విన్యాసాలను తన యూట్యూబ్ లో పోస్ట్ చేయగా చాలామంది ఈ వయసులో మీకెందుకు ఆంటీ ఇలాంటి పనులు తిని ఇంట్లో కూర్చోక అని నెగిటివ్ కామెంట్స్ పెట్టారు.ఇలా ఎన్ని విమర్శలు వచ్చిన తన పని మాత్రం ఆపలేదు.అయితే ఇప్పుడు తన ధైర్యమే అందరిచేత తనని ప్రశంసించేలా చేస్తున్నాయి. తనని విమర్శించిన వారే ఇప్పుడు మీకు ఉన్న ఆత్మవిశ్వాసం ,ధైర్యం అందరికి ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు.దీంతో ఆమెకు కొంత ఊరట లభించింది.ఒకవైపు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే సామజిక మాద్యమాలలో తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది.ఇంకా సోషల్ మీడీయాలో తన ఫోటోలని పోస్ట్ చేస్తూ కార్యసిద్ధి కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.