SaI Pallavi : తన నటనతో డాన్స్ తో తెలుగు ప్రేక్షకలను ఆకట్టుకుంది సాయి పల్లవి. ఇక ప్రస్తుతం వరుస హాట్ లతో దూసుకెళ్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మలయాళీ ముద్దు గుమ్మ వేసే డాన్స్ స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తన డాన్స్ కి మంచి క్రేజ్ ఉంది. తన డాన్స్ స్టెప్స్ కి అంత ఫాలోయింగ్ ఉంది మరి. అయితే అందరికీ భిన్నంగా తనకు నచ్చినట్లుగా సినిమాలను తీయడం సాయి పల్లవి నైజం. ఎవరు చెప్పిన వినదు తనకు నచ్చితేనే చేస్తుంది. ఈమధ్య చిరంజీవి ఇచ్చిన ఆఫర్ ను కూడా అవలీలగా రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. నటనలోనూ నాట్యంలోనూ పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోదు సాయి పల్లవి. అలాగే తను ఎంచుకునే కథలు ,చాలా బాగుంటాయని చెప్పాలి. తను ఏ పాత్ర చేసిన ప్రేక్షకులు ఇట్టే ఫిదా అవుతారు. తన నటన అలాంటిది మరి..
ఇలా తను ఎంచుకున్న పాత్రలో ఎంతగానో ప్రేక్షకులను మెప్పించింది . ప్రేమమ్ సినిమా తో వెండి తెరలో అడుగు పెట్టింది సాయి పల్లవి. ఇక ఈమె చదివింది డాక్టర్ చదువు అయిన నటన మీద ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి వచ్చింది. ఇక సాయి పల్లవి నటించిన ఫిదా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భానుమతి ఒకటే పీస్ హై బ్రిడ్ పిల్ల అంటూ తన నటనతో ఆకట్టుకుంది సాయి పల్లవి. ఈ సినిమాతో తను చాలా మంది అభిమానులను సంపాదించుకుంది అని చెప్పాలి. ఇలా తను నటించిన ప్రతి సినిమాలో పాత్రలు వెరైటీగా ఉంటాయి.

అయితే ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ మంచి పాత్ర చేసుకుంటూ మంచి క్రేజ్ సంపాదించింది. ఇది ఇలా ఉండగా సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించిందట. అయితే తను చేసిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ సినిమా ఏంటో తెలుసా. జయం రవి కంగనా రనౌత్ నటించిన ధామ్ ధూమ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది సాయి పల్లవి. ,ఈ సినిమాలో నటించినప్పుడు సాయి పల్లవి వయసు కేవలం ఆరేళ్లు మాత్రమే. ఇలా సాయి పల్లవి చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ వస్తుంది.