Star Heroine : చూశారు కదా ఫోటో. ఆ ఫోటోలో ఉన్న చిట్టి పాప ఎవరో గుర్తుపట్టారా? తను ఇప్పుడు స్టార్ హీరోయిన్. అవును.. తను తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్. 2017 లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్. అస్సలు గుర్తుకు రావడం లేదా? అయితే మీకో హింట్ ఇస్తే ఇట్టే చెప్పేస్తారు. మీరు లై సినిమా చూశారా. నితిన్ హీరోగా వచ్చిన లై సినిమాతోనే తన సినిమా కెరీర్ ను ప్రారంభించింది. ఆమె ఎవరో కాదు.. మేఘా ఆకాశ్.

మేఘా ఆకాశ్ ది తమిళనాడు. అందుకే తమిళం, తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలని అనుకుంటోంది. తను తెలుగులో చాలా సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ చేస్తూ రచ్చ చేస్తోంది మేఘా ఆకాశ్. అయితే.. తను చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. కొన్ని సినిమాల్లో ప్రాముఖ్యత ఉన్నా చిన్న పాత్ర అయినా చేయడానికి రెడీ అంటోంది మేఘ.
Star Heroine : రీసెంట్ గా గుర్తుందా శీతాకాలంలో మెరిసిన మేఘా
ఇటీవల గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో మేఘా మెరిసింది. రజనీ కాంత్ మూవీ పెటాలోనూ నటించింది మేఘా. మై డియర్ మేఘ అనే సినిమాలోనూ నటించింది మేఘా ఆకాశ్. అయితే.. ఇప్పటి వరకు తను ఒక్కటి కూడా సరైన హిట్ పడలేదు. తమిళంలోనూ తను చాలా సినిమాల్లో నటించినా అక్కడ కూడా అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఓంశ్రీకనకదుర్గ, మను చరిత్ర లాంటి సినిమాలో ప్రస్తుతం నటిస్తోంది మేఘా ఆకాశ్. చూద్దాం మరి ఆ సినిమాలు అయినా తనకు గుర్తింపును తీసుకొస్తాయో?