Naga Chaitanya- Samantha : ఏ మాయ చేశావే చిత్రంలో జంటగా నటించి అందరి మెప్పు పొందిన నాగ చైతన్య సమంత కొద్ది రోజుల తర్వాత పెళ్లి పీటలెక్కారు. నాలుగేళ్లు వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగిన గత ఏడాది అక్టోబర్ 2న ఈ జంట విడాకులు తీసుకున్నారు. వారి విడాకుల నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచింది. చైతూ- సమంత విడిపోవడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు తిరిగి కలిసిపోతే బాగుండని కొందరు అనుకుంటున్నారు. అయితే నాగ చైతన్య – సమంత విడాకుల విషయంపై కొద్ది రోజుల క్రితం నాగార్జున స్పందించగా, తాజాగా గౌతమ్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమిళ్ హీరో శింబుతో గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కిన “లైఫ్ అఫ్ ముత్తు” శనివారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెలుగులో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఇందులో సమంత- నాగ చైతన్య జంట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ మాయ చేసావే సినిమాతో సమంతను వెండితెరకు పరిచయం చేసిన గౌతమ్ మీనన్ వారి విడాకుల విషయం గురించి మాట్లాడారు. మీ సినిమా ద్వారా సమంత, చై కలిసారు. పెళ్లి చేసుకొని తర్వాత విడిపోయారు. ఒకే ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా, చేసుకుంటే ఇలాంటి షార్ట్ టర్మ్ రిలేషన్ షిప్స్ ఎందుకు వస్తున్నాయి అని గౌతమ్‌ని ప్రశ్నించారు.

Naga Chaitanya- Samantha : క్లారిటీ ఇచ్చేశాడు..
దీనికి స్పందించిన గౌతమ్ మీనన్… కొన్ని బంధాల గురించి మనం మాట్లాడకూడదు. రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరి మధ్య విబేధాలు రావచ్చు, తప్పులు ఉండొచ్చు. వాటిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళితే ఎలాంటి సమస్యలు రావు. అప్పుడు ఒకే ప్రొఫెషన్లో ఉన్నా, ఇతర ప్రొఫెషన్లో ఉన్నదానికి సంబంధం లేదు. రెండు మనసుల కలిస్తే ఆటోమెటిక్‌గా ఇద్దరు వ్యక్తులు కలుస్తారు అంటూ గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఆయన ఏమాయ చేశావే 2 సీక్వెల్‌తో పాటు పలు చిత్రాల సీక్వెల్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. టాలీవుడ్ హీరో “రామ్ పోతినేని”తో తదుపరి చిత్రం చేయబోతున్నట్టు స్పష్టం చేశాడు.